Hanuma Vihari: విహారి వలంటీర్స్‌...

Never imagined getting a hospital bed would be so difficult says Hnuma Vihari - Sakshi

కోవిడ్‌ బాధితులకు క్రికెటర్‌ హనుమ విహారి సాయం

ఆసుపత్రిలో పడకల కోసం

ఇన్ని కష్టాలను ఊహించలేదన్న భారత జట్టు సభ్యుడు

న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు.

ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్‌ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్‌షైర్‌ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్‌ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం జూన్‌ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది.  

జట్టుకోసం ఏదైతే అది...
ఇంగ్లండ్‌ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్‌లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేశాను. జట్టు మేనేజ్‌మెంట్‌ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్‌ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-05-2021
May 15, 2021, 09:39 IST
లక్డీకాపూల్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్‌...
15-05-2021
May 15, 2021, 08:47 IST
రెండు నెలల నుంచి 250 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఐసోలేషన్‌ అయిన వారందరికీ అవసరమైన సేవలను అందజేశారు. 
15-05-2021
May 15, 2021, 08:27 IST
ఈ 4 గంటల సమయం తమకు తక్కువని భావిస్తున్న అనేక మంది నగరవాసులు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు.
15-05-2021
May 15, 2021, 05:25 IST
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. జీ కొండూరు మండలం...
15-05-2021
May 15, 2021, 05:24 IST
ముంబై: కరోనా వైరస్‌ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్‌...
15-05-2021
May 15, 2021, 05:04 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు ఇకపై మాస్కు ధరించాల్సిన...
15-05-2021
May 15, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ...
15-05-2021
May 15, 2021, 04:50 IST
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్‌ వేవ్‌ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు,...
15-05-2021
May 15, 2021, 04:23 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నికర...
15-05-2021
May 15, 2021, 04:18 IST
తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య...
15-05-2021
May 15, 2021, 04:13 IST
ఒంగోలు టౌన్‌: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు....
15-05-2021
May 15, 2021, 03:36 IST
సైనసైటిస్‌ (ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీ) ఉన్న వారిలో ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. బ్లాక్‌ ఫంగస్‌పై ఆందోళన...
15-05-2021
May 15, 2021, 03:00 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ...
14-05-2021
May 14, 2021, 21:26 IST
సాక్షి, హైదరాబాద్‌:  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ శుక్రవారం లాంచ్‌ చేసింది. త్వరలోనే ఇది మార‍్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ...
14-05-2021
May 14, 2021, 21:25 IST
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో...
14-05-2021
May 14, 2021, 20:40 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ను జయించిన వారిలో ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండంటం లేదు. బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సమస్య...
14-05-2021
May 14, 2021, 18:52 IST
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్‌ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల...
14-05-2021
May 14, 2021, 17:51 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,88,803...
14-05-2021
May 14, 2021, 16:13 IST
పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. మానసిక రుగ్మతలైన....
14-05-2021
May 14, 2021, 15:55 IST
న్యూఢిల్లీ: కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top