సింగిల్స్‌ చాంప్స్‌ నవ్య, జస్టిన్‌ హో | Navya, Justin Ho Kotak India Junior International Series | Sakshi
Sakshi News home page

Kotak India Junior International Series: సింగిల్స్‌ చాంప్స్‌ నవ్య, జస్టిన్‌ హో

Aug 30 2022 9:46 AM | Updated on Aug 30 2022 9:49 AM

Navya, Justin Ho Kotak India Junior International Series - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొటక్‌ ఇండియా జూనియర్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అండర్‌–19 మహిళల సింగిల్స్‌లో నవ్య కండేరి (భారత్‌), జస్టిన్‌ హో (మలేసియా) విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో నవ్య 21–15, 21–18తో ఇషారాణి బారువా (భారత్‌)పై, జస్టిన్‌ 21–18, 21–14తో ప్రణయ్‌ షెట్టిగర్‌ (భారత్‌)పై గెలిచారు.

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో నికోలస్‌ రాజ్‌–తుషార్‌ సువీర్‌ (భారత్‌) జోడీ 21–14, 21–18తో అపిలుక్‌–విత్‌చాయా (థాయ్‌లాండ్‌) ద్వయంపై... మహిళల డబుల్స్‌ ఫైనల్లో ఓంగ్‌ జిన్‌ యీ–కార్మెన్‌ టింగ్‌ (మలేసియా) ద్వయం 21–16, 21–15తో రాధిక శర్మ–తన్వీ శర్మ (భారత్‌) జోడీపై నెగ్గాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో మయాంక్‌ రాణా–నర్ధన రవిశంకర్‌ (భారత్‌) జోడీ 25–23, 23–21తో కణపురం సాత్విక్‌ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్‌ (భారత్‌) జంటను ఓడించింది.
చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ వచ్చేస్తున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement