చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌.. విరాట్‌ కోహ్లి, స్మిత్‌ సరసన | Najmul Hossain Shanto Joins Virat Kohli In An Elite List With Century On Test Debut | Sakshi
Sakshi News home page

BAN vs NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌.. విరాట్‌ కోహ్లి, స్మిత్‌ సరసన

Published Thu, Nov 30 2023 6:52 PM | Last Updated on Thu, Nov 30 2023 7:25 PM

Najmul Hossain Shanto Joins Virat Kohli In An Elite List With Century On Test Debut - Sakshi

సిల్హెట్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్ హొస్సేన్ శాంటో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో  శాంటో సెంచరీతో మెరిశాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్‌ రహీం(43) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో సెంచరీ చేసిన 32వ క్రికెటర్‌గా షాంటో ఈ రి​కార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు.
చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్‌ లెజెండ్‌ సమాధానమిదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement