తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్‌ | IPL 2026, Mumbai Indians Set To Play Their 300th T20 Match, Eye Historic Milestone | Sakshi
Sakshi News home page

IPL 2026: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న ముంబై ఇండియన్స్‌

Mar 29 2026 4:07 PM | Updated on Mar 29 2026 5:12 PM

Mumbai Indians Create World Record In IPL

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ముంబై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఒక అద్భుతమైన మైలు రాయిని అందుకోనుంది. ముంబై జట్టుకు ఇది 300వ టీ20 మ్యాచ్‌ కావడం గమానర్హం. తద్వారా టీ20 క్రికెట్‌ చరిత్రలో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్‌ ఫ్రాంచైజీగా ముంబై సరికొత్త రికార్డు సృష్టించనుంది.

కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకుంది. ముంబై జట్టు ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. తద్వారా అత్యధిక సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుగా సీఎస్‌కేతో కలిసి సంయుక్తంగా ముంబై అగ్రస్ధానంలో కొనసాగుతోంది. 

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్‌లలో 162 విజయాలు నమోదు చేసింది. ఓవవరాల్‌గా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియ‌న్స్ మూడో స్ధానంలో నిలిచింది. మొద‌టి స్దానంలో పాకిస్తాన్‌(303) ఉండ‌గా, రెండో సోమ‌ర్‌సెట్‌(303) కొన‌సాగుతోంది.

అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన టాప్-5 ఐపీఎల్ జట్లు
ముంబై ఇండియన్స్‌-299
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-287
కోల్‌కతా నైట్‌రైడర్స్‌-281
చెన్నై సూపర్ కింగ్స్‌-277
ఢిల్లీ క్యాపిటల్స్‌-274
చదవండి: SA vs NZ: ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా
 

Advertisement
 
Advertisement
Advertisement