PSL-​‍6 Final: విజేత ముల్తాన్‌ సుల్తాన్స్‌

Multan Sultans Won Maiden Title In PSL Against Peshawar Jalmi - Sakshi

అబుదాబి: అబుదాబి వేదికగా జరిగిన పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌(పీఎస్‌ఎల్‌-6) టైటిల్‌ను ముల్తాన్‌ సుల్తాన్స్‌ చేజెక్కించుకుంది. పెషావర్‌ జాల్మితో జరిగిన ఫైనల్లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ 47 పరుగులతో విజయం సాధించి తొలిసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మక్సూద్‌ 35 బంతుల్లో 65 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రోసౌ 50 పరుగులతో ఆకట్టుకోగా.. మసూద్‌ 37, రిజ్వాన్‌ 30 పరుగులతో సహకరించారు.

అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌ జాల్మి ఏదశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇమ్రాన్‌ తాహిర్‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పెషావర్‌ బ్యాటింగ్‌లో షోయబ్‌ మాలిక్‌ 48 పరుగలతో రాణించగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మక్సూద్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను ఎగురేసుకుపోవడం విశేషం. గత నవంబర్‌లో కరోనా కారణంగా అర్థంతరంగా రద్దు చేసిన పీఎస్‌ఎల్‌-6ను అబుదాబి వేదికగా రీషెడ్యూల్‌ చేసి మ్యాచ్‌లను నిర్వహించిన సంగతి తెలిసిందే.

చదవండి: PSL: ఒక్క ఓవర్‌లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్‌ బెర్త్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top