IPL 2023: 'ధోని, రోహిత్‌, కోహ్లి కాదు.. అతడే ఐపీఎల్‌ సూపర్‌ కెప్టెన్‌'

MS Dhoni, Virat Kohli Snubbed As Rp singh Picks Favourite Captain - Sakshi

ఐపీఎల్-2023 సీజన్‌ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 31 నుంచి ఈ ధానాధాన్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి.

ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఎంతో మంది క్రికెటర్‌లు కెప్టెన్‌లగా తమ సత్తా చాటుకున్నారు. 15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఎంస్‌ ధోని, రోహిత్‌ శర్మ, కోహ్లి, పాంటింగ్‌, వార్నర్‌ వంటి వారు సారథిలగా తమ జట్లకు ఎన్నోచిరస్మరణీయ  విజయాలను అందించారు.

ముఖ్యంగా రోహిత్‌ శర్మ ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్‌ను అందించగా.. ధోని సారథ్యంలో సీఎస్‌కే నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ టైటిల్‌ సాధించకపోయనప్పటికీ.. ఒక్క సారి ఫైనల్‌, రెండు సార్లు ఫైనల్‌కు చేరింది.

ఇక​ ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌ ఫేవరేట్‌ కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న భారత మాజీ పేసర్‌ ఆర్పీసింగ్‌కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అతడు చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా తన ఫేవరేట్‌ కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్నాడు.

జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీసింగ్‌ మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో నాకు ఇష్టమైన కెప్టెన్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్. అతడు ఆస్ట్రేలియాతో పాటు డెక్కన్ ఛార్జర్స్‌కు మూడేళ్లపాటు నాయకుడిగా ఉన్నాడు. అతడు సారథిగా మేము తొలి సీజన్‌లోనే ఛాంపియన్స్‌గా నిలిచాం. అందుకే గిల్‌క్రిస్ట్ నా ఫేవరేట్‌ కెప్టెన్‌. అనంతరం 2010 సీజన్‌లో కూడా మేము అద్భుతంగా రాణించాము.

దురదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాం" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్‌(సన్‌రైర్స్‌ హైదరాబాద్‌) తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

అనంతరం 2010 సీజన్‌లో కూడా డెక్కన్ ఛార్జర్స్‌ అదరగొట్టింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ మార్‌క్రమ్‌ వ్యవహరించనున్నాడు.
చదవండి: 'రోహిత్‌, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top