New Rules Of Cricket 2022: మన్కడింగ్‌ తప్పుకాదు: ఐసీసీ

MCC Announced New Cricket Code Of Laws Ban Mankading From October - Sakshi

లండన్‌: మన్కడింగ్‌ గుర్తుందిగా..! బౌలింగ్‌ వేసే సమయంలో బంతి బౌలర్‌ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్‌ బ్యాటర్‌ పరుగు పెడితే బౌలర్‌ వికెట్లను గిరాటే వేయడమే మన్కడింగ్‌. ఐపీఎల్‌లో బట్లర్‌ను అశ్విన్‌ ఇలా అవుట్‌ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. ఇప్పుడు  క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాతే అమలవుతాయి. 

ఎంసీసీ సవరణలివి... 
►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్‌ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు.  
►క్యాచ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్‌ చేయాలి. ఓవర్‌ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్‌ దాటిన నెపంతో నాన్‌ స్ట్రయికర్‌ బ్యాటింగ్‌ చేయడానికి వీలులేదు.
►ఫీల్డింగ్‌ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్‌ భారీషాట్‌ ఆడినపుడు బ్యాటింగ్‌ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్‌ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్‌) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. 

చదవండి: IPL 2022: అఫ్గన్‌ ఆటగాడికి బంపరాఫర్‌.. ఇక సాహాకు కష్టమే

Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top