#RCB: మాస్టర్‌ ప్లాన్‌.. ఆర్‌సీబీ పేరుతో అడ్డుపుల్ల!

Little-Girl Holding Placard No School Until RCB Wins IPL Title - Sakshi

ఐపీఎల్‌లో దురదృష్టమైన జట్టుగా పేరు పొందింది ఆర్‌సీబీ. కప్‌ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్‌ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్‌ నమ్‌దే అంటూ బరిలోకి దిగే ఆర్‌సీబీ లీగ్‌ దశ వరకు బాగానే ఆడుతున్నా ప్లేఆఫ్‌ దశలో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు. మూడుసార్లు ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆర్‌సీబీ కనీసం ఈసారైనా టైటిల్‌ కొట్టాలని కోరుకుందాం.

ఈ విషయం పక్కనబెడితే.. బుధవారం కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌కు హాజరైన ఒక చిన్నారి చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ టైటిల్‌ కొట్టేవరకు నేను స్కూల్‌లో జాయిన్‌ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్‌ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడం హైలెట్‌గా నిలిచింది.

ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేయగా చిన్నారి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్‌ చేశారు. ''వాళ్లు టైటిల్‌ కొట్టినా.. కొట్టకపోయినా డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది''.. ''ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం''.. ''ఆర్‌సీబీ కప్‌ గెలిస్తే ఓకే.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్‌ ఎగ్గొట్టడానికి ఆర్‌సీబీ పేరుతో మాస్టర్‌ ప్లాన్‌ వేశావుగా'' అంటూ పేర్కొన్నారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆర్‌సీబీ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో ఉంది.

చదవండి: ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top