IPL 2023 RCB Vs KKR: Virat Kohli Won The Toss As RCB Captain After 580 Days, Deets Inside - Sakshi
Sakshi News home page

Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత

Apr 26 2023 7:56 PM | Updated on Apr 26 2023 10:09 PM

IPL 2023: Virat Kohli Won The Toss As-RCB Captain After 580 Days Vs KKR - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో విరాట్‌ కోహ్లి స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల గత రెండు మ్యాచ్‌లుగా డుప్లెసిస్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ డుప్లెసిస్‌ మరోసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పరిమితం కావడంతో కోహ్లి మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

అయితే గత రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన కోహ్లి.. ఈసారి మాత్రం నెగ్గాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా 580 రోజుల తర్వాత టాస్‌ నెగ్గి చరిత్ర సృష్టించాడు.  కోహ్లి ఆఖరిసారి 2021 ఐపీఎల్‌లో కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గాడు. ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. తాజాగా ఐపీఎల్‌ 2023లో మళ్లీ అదే కేకేఆర్‌తో మ్యాచ్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌గా టాస్‌ నెగ్గడం విశేషం.

చదవండి: సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం

'ఒక్క ఓవర్‌ జీవితాన్ని తలకిందులు చేసింది.. త్వరగా కోలుకో'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement