Kohli Test Captaincy Retirement-Rishab Panth: కోహ్లి రిటైర్‌మెంట్‌... పంత్‌కు మద్దతుగా నిలిచిన యువీ

Kohli Test Captaincy Retirement Reads The Game Well Yuvraj Backs Rishabh Pant - Sakshi

కీలకమైన టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి అనూహ్య నిష్క్రమణతో టీమిండియా కొత్త కెప్టెన్‌ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకేముంది టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకే పగ్గాలు అప్పగిస్తారు కదా! అనే సందేహం రావొచ్చు. అయితే, కొన్ని కారణాల వల్ల అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. వయసురిత్యా, ఫిట్‌నెస్‌ పరంగా, ముఖ్యంగా గాయాలతో సతమతమవుతున్న రోహిత్‌ వైపునకు సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరి క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో కొందరు యువ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
(చదవండి: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే)

అందులో ఎవరు కోహ్లి నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపడుతారో ఖచ్చితంగా చెప్పలేం కానీ, రిషభ్‌ పంత్‌ అయితే బాగుంటుందని కొందరు దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. సునీల్‌ గావస్కర్‌ పంత్‌కే ఓటేయగా తాజాగా యువరాజ్‌ సింగ్‌ సైతం ఈ యువ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌కు మద్దతుగా నిలిచాడు. వికెట్ల వెనక నుంచి పంత్‌ ఆట మొత్తాన్ని లోతుగా అధ్యయనం చేసి మెరుగ్గా జట్టును నడిపిస్తాడని అన్నాడు. ‘అబ్‌సొల్యుట్లీ! రీడ్స్‌ ద గేమ్‌ వెల్‌ బిహైండ్‌ ద స్టంప్స్‌’ అంటూ గావస్కర్‌ కామెంట్‌కు యువీ ఈ మేరకు ట్విటర్‌లో స్పందించాడు. కాగా, కేప్‌టౌన్‌ టెస్టులో కీలక బ్యాటర్లు విఫలమైన చోట పంత్‌ సెంచరీతో (100 నాటౌట్‌) మెరిసిన సంగతి తెలిసిందే.
(చదవండి: రాజీనామా విషయాన్ని ముందుగా ఆయనతో చర్చించిన తర్వాతే.. కోహ్లి ప్రకటన!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top