కేశవ్‌ మహరాజ్‌ 'జై శ్రీరామ్‌'.. అభిమానుల ప్రశంసల వర్షం

Keshav Maharaj Writes Jai Shree Raam Post After ODI Series Win Vs India - Sakshi

టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రొటీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గాలనే కోరిక టీమిండియాకు అలాగే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియాతో వన్డే సిరీస్‌ గెలిచిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేశవ్‌ మహరాజ్‌  షేర్‌ చేసిన పోస్టులో జై శ్రీరామ్‌ అని పెట్టడం ఆసక్తి కలిగించింది. '' టీమిండియాతో సిరీస్‌ గెలవడం మాకు గర్వంగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో ఓటమి అనంతరం మా గడ్డపై టీమిండియాను ఓడించడం మంచి బూస్టప్‌ను అందించింది. ఇక్కడితో ఇది ఆగిపోదు.. తర్వాతి సిరీస్‌కు మరింతగా సన్నద్ధమవ్వబోతున్నాం.. జై శ్రీరామ్‌'' అంటూ ముగించాడు.

చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ'

అయితే మహరాజ్‌ పెట్టిన పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. ''జై శ్రీరామ్‌ అని పెట్టిన కేశవ్‌ మహరాజ్‌.. తన భారతీయ మూలాలను ఇంకా మరిచిపోలేదు. ఇది గొప్ప విషయం.'' అంటూ కామెంట్‌ చేశారు. ఇక 31 ఏళ్ల కేశవ్‌ మహరాజ్‌ భారత సంతతికి చెందినవాడు. అతని చిన్నప్పుడే కుటుంబం సౌతాఫ్రికాలో స్థిరపడింది. ఇంకో విశేషమేమిటంటే.. కేశవ్‌ మహరాజ్‌ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో జై శ్రీరామ్‌.. జై శ్రీ హనుమాన్‌ అని రాసి ఉంటుంది.

2016లో సౌతాఫ్రికా తరపున అంతర్జాతీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కేశవ్‌ మహరాజ్‌ అనతికాలంలోనే జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌ స్పిన్నర్‌గా మారిన కేశవ్‌ మహరాజ్‌ 39 టెస్టుల్లో 130 వికెట్లు, 18 వన్డేల్లో 22 వికెట్లు, 8 టి20ల్లో ఆరు వికెట్లు తీశాడు.

చదవండి: శార్ధూల్‌, దీపక్‌ చాహర్‌లపై టీమిండియా కోచ్‌ ప్రశంసలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top