ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌కు కోట్లాభిషేకం

Jhye Richardson Sold To Punjab Kings For Rs 14 Crore - Sakshi

చెన్నై: ఈ ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ జై రిచర్డ్‌సన్‌ పంట పండింది. జై రిచర్డ్‌సన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లకు దక్కించుకుంది. రిచర్డ్‌సన్‌ కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పోటీ పడగా పంజాబ్‌ కింగ్స్‌  అతన్ని సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ కనీస ధర 1 కోటి 50 లక్షల రూపాయలు ఉండగా తీవ్రమైన పోటీ ఏర్పడింది. 

ఆర్సీబీ పలుసార్లు అతని కోసం బిడ్‌కు వెళ్లగా ఆపై వెనక్కి తగ్గింది. చివరకు పంజాబ్‌ కింగ్స్‌ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. రిచర్డ్‌సన్‌కు ఇదే తొలి ఐపీఎల్‌.  ఇదిలా ఉంచితే, ఈ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను 14 కోట్ల 25 లక్షల రూపాయలకు ఆర్సీబీ కొనుగోలు చేయగా,  మోరిస్‌ను రూ. 16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. ఇప్పటివరకూ ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాళ్లు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top