జొకోవిచ్‌ సరసన సినెర్‌ | Jannik Sinner ties Novak Djokovic Masters 1000 record with 31st straight victory | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ సరసన సినెర్‌

May 13 2026 2:29 AM | Updated on May 13 2026 2:29 AM

Jannik Sinner ties Novak Djokovic Masters 1000 record with 31st straight victory

‘మాస్టర్స్‌’ టోర్నీల్లో వరుసగా 31వ విజయం

రోమ్‌: ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్‌ ఆండ్రియా పెలెగ్రినో (ఇటలీ)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ 6–2, 6–3తో గెలిచాడు. 

తద్వారా మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుసగా 31వ విజయంతో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ పేరిట ఉన్న రికార్డును సినెర్‌ సమం చేశాడు. 2011లో జొకోవిచ్‌ కూడా మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుసగా 31 మ్యాచ్‌ల్లో నెగ్గాడు. క్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ గెలిస్తే మాస్టర్స్‌ టోర్నీల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement