ఫాస్ట్‌ బౌలర్లతో వచ్చిన సమస్య ఇదే.. రక్తం చిందించిన వేళ

James Anderson Recall That He-Broken New Zeland Batter Teeth 2008 Test - Sakshi

క్రికెట్‌లో ఫాస్ట్‌ బౌలర్లంటే వేగానికి పెట్టింది పేరు. వారు అత్యంత వేగంతో విసిరే బంతులు ఎవరి మూతులు, ముక్కు విరగ్గొడతాయేమోనని చిన్నపాటి భయం ఉంటుంది. 1970వ దశకంలో వెస్టిండీస్‌ నుంచి అరవీర భయంకరమైన బౌలర్లు ఉండేవారు. వారు బౌలింగ్‌కు వస్తున్నారంటే ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టేది. అప్పట్లో హెల్మెట్‌  సహా కీలకమైన గార్డ్స్‌ అందుబాటులో లేకపోడంతో ఆటగాళ్ల తలలు పగిలి రక్తాలు కారడం సహజంగా కనిపించేది.

కానీ కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాట్స్‌మన్‌కు గ్లోవ్స్‌, ప్యాడ్స్‌, హెల్మెట్‌ లాంటి రక్షణ కవచాలు వచ్చాయి. ఫాస్ట్‌ బౌలర్లు ఎంత వేగంతో సంధించినా చిన్నపాటి గాయాలు తప్ప పెద్దగా నష్టం ఉండేది కాదు. షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌ లీ, షేన్‌ బాండ్‌లు వేగానికి పెట్టింది పేరు. ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పిలిప్‌ హ్యూజ్‌ ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచంలో విషాదాన్ని మిగిల్చింది. సీన్‌ అబాట్‌ వేసిన బంతి హ్యూజ్‌ హెల్మెట్‌ సందులో నుంచి వెళ్లి మెడ వెనుక సున్నితమైన ప్రాంతంలో తగలడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఆ తర్వాత రెండు రోజులకే పిలిప్‌ హ్యూజ్‌ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనే అంతకముందు 2008లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ వేసిన ఒక బంతి ప్రత్యర్థి బ్యాటర్‌ రక్తం చిందేలా చేసింది.

తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అండర్సన్‌ మరోసారి ఫ్లిన్‌ అంశాన్ని గుర్తు చేశాడు. 2008లో ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా కివీస్‌ ఆటగాడు డేనియల్‌ ఫ్లిన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న అండర్సన్‌ మరోసారి బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే 12 బంతులు మాత్రమే ఆడిన ఫ్లిన్‌.. అండర్సన్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా వచ్చి హెల్మెట్‌ గ్రిల్స్‌ లోపలకి వచ్చి ప్లిన్‌ మూతిని పగలగొట్టింది. ఈ దెబ్బకు ప్లిన్‌ నోటి నుంచి పన్ను ఊడి రక్తం కారసాగింది.

ఈ దెబ్బకు ఫ్లిన్‌ క్రీజులోనే కూలబడ్డాడు. నోటి నుంచి రక్తం దారగా కారడంతో ఆటగాళ్లు కాస్త భయానికి లోనయ్యారు. వెంటనే ఫ్లిన్‌ను ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని.. బంతి వేగానిక పన్ను మాత్రమే ఊడిందని.. మిగతా ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు. దీంతొ లంచ్‌ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఫ్లిన్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు. దీంతో భయపడిన అంపైర్లు ఫ్లిన్‌ను పెవిలియన్‌కు పంపించారు. అయితే కేవలం భయంతోనే ఫ్లిన్‌ వాంతులు చేసుకున్నాడని.. ఆ రాత్రంతా వాంతులు అయ్యాయని.. న్యూజిలాండ్‌ బోర్డు మరుసటిరోజు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

చదవండి: Ranji Trophy 2022: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు

'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్‌ ఆరోపణలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top