Ireland register their highest Test score of 492 against Sri Lanka - Sakshi
Sakshi News home page

IRE vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌.. టెస్టుల్లో అత్యధిక స్కోర్‌!

Apr 25 2023 4:51 PM | Updated on Apr 25 2023 5:02 PM

Ireland register their highest Test score of 492 against Sri Lanka - Sakshi

గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య శ్రీలంకకు  పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఐర్లాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 492 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. అంతకుముందు 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఐర్లా‍ండ్‌ 339 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఐర్లాండ్‌ ఆ రికార్డును బద్దలు కొట్టింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐరీష్‌ బ్యాటర్లలో పాల్‌ స్టిర్లింగ్‌(103), కర్టిస్ కాంఫర్(111) సెంచరీలతో చెలరేగారు. అదే విధంగా ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ(95) పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో ప్రబాత్ జయసూర్య ఐదు వికెట్ల హాల్‌ సాధించగా.. విశ్వా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో రోజు ఆటను వెలుతురు లేమి కారణంగా నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. క్రీజులో నిషాన్ మదుష్కా(41), దిమిత్‌ కరుణరత్నే(39) ఉన్నారు.


చదవండి: Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్‌.. పాపం సూర్యకుమార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement