బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటెన్స్ (జీటీ) జట్ల మధ్య చిన్నస్వామి క్రీడామైదానంలో ఈనెల 24న జరిగిన రాయల్ ఐపీఎల్ పోటీల సమయంలో 240 సీసీటీవీ కెమెరాల సర్క్యూట్‌ను కట్‌చేసిన ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్‌సీఏ) స్పషీ్టకరణను ఇచ్చింది. ఇది పూర్తిగా ప్రైవేట్ అమ్మకందారులతో కూడిన అంతర్గత వివాదంగా స్పష్టం చేసింది.
క్రీడామైదానం భద్రతకు సంబంధించి సంబంధం లేదని వెల్లడించింది. అమ్మకందారుల, దాని ఉద్యోగుల మధ్య చెల్లింపులకు సంబంధించి భిన్నాభిప్రాయాలతో ఈ సమస్య ఉద్భవించిందని పేర్కొంది. హర్యాణాకు చెందిన ఎస్‌టీఏక్యూ టెక్నాలజీస్ సంస్థ ఆదిత్య భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్రదుర్గ జిల్లా హిరియూర మంజునాథ్ (37), ఉత్తర ప్రదశ్ సుల్తాన్‌పుర అబ్దుల్ కలాం (19) అరెస్ట్ చేశారని పేర్కొంది.
‘క్రీడామైదానం భద్రత కోసం అమర్చబడిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతను ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్ అనే ఉప పంపిణీదారుల సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థలో మంజునాథ్, అబ్దుల్ కలాం గతంలో పనిచేశారు. అయితే కంనెనీ నుంచి జీతం పెండింగ్ ఉంది, ఎంత అడిగినా జీతం ఇవ్వకపోవటంతో కోపగించుకొని ఈ కృత్యానికి పాల్పడ్డారు’. ఈ విషయం తనిఖీ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు.


