కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపు | IPL 2026 Match 6: KKR VS SRH Live Updates | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుపు

Apr 2 2026 7:02 PM | Updated on Apr 2 2026 11:17 PM

IPL 2026 Match 6: KKR VS SRH Live Updates

కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. కేకేఆర్‌ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
5.6వ ఓవర్‌- 74 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. గ్రీన్‌ (2) రనౌటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
4.6వ ఓవర్‌- 67 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో రహానే (8) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. హర్ష్‌ దూబే బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ (28) క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 

వరుస బంతుల్లో వికెట్లు
18.2వ ఓవర్‌- ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో సలీల్‌ అరోరా క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
18.1వ ఓవర​్‌- 200 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
9.2వ ఓవర్‌- 118 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనుకూల్‌ రాయ్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ వర్మ (1) ఔటయ్యాడు.

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
అప్పటిదా​కా జోరుగా సాగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆట ఒక్కసారిగా మందగించింది. ముజరబానీ ఒకే ఓవర్‌లో (8.2, 8.4) 2 వికెట్లు (ఇషాన్‌ (14), అభిషేక్‌ (48)) వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 9 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 116-3గా ఉంది. అనికేత్‌, క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. హెడ్‌ (46) ఔట్‌
5.4వ ఓవర్‌- 82 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ట్రవిస్‌ హెడ్‌ (46) విధ్వంసం సృష్టించి కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ తలపడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సన్‌రైజర్స్‌ ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు..

కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

ఇంపాక్ట్ సబ్‌లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్

సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్

ఇంపాక్ట్ సబ్‌లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement