ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్‌లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌ను కూడా కేకేఆర్ ఓటమితోనే ఆరంభించింది.
ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙
Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U— IndianPremierLeague (@IPL) March 29, 2026
ఆరు వికెట్ల తేడాతో
వాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్.. కేకేఆర్ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సునిల్ నరైన్‌కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.
పవర్ ప్లేలో అదే అత్యుత్తమం
జియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లేలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌తో బౌలింగ్ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్ శర్మను టార్గెట్ చేసే వీలు ఉండేది.
నరైన్‌కు రోహిత్‌పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్‌ను త్వరగా అవుట్ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్‌కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్ సింగ్ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.
వారిద్దరు అద్బుతం
ఏదేమైనా రోహిత్ శర్మ, రికెల్టన్‌లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. కేకేఆర్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన సునిల్ నరైన్.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తిలక్ వర్మ (18) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్!


