ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలు.. హైదరాబాద్‌లో స్క్రీనింగ్‌ల సందడి! | Hyderabad Gears Up For IPL 2026 With Big Screens, Live Zones, And Special Viewing Experiences | Sakshi
Sakshi News home page

IPL 2026: ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలు.. హైదరాబాద్‌లో స్క్రీనింగ్‌ల సందడి!

Mar 28 2026 8:00 AM | Updated on Mar 28 2026 10:07 AM

ipl 2026 hyderabad screening venues offers big screens dj food

నగరంలో భారీ స్క్రీన్‌ల ఏర్పాటు 

వీక్షకుల కోసం వేదికలు సిద్ధం 

ప్రత్యేక ఆఫర్లు, వంటకాల మెనూలు  

నెల మొత్తం ప్రత్యేక ప్యాకేజీలు సైతం..  

క్రికెట్‌ అభిమానుల్లో కోలాహలం  

సాక్షి,  హైదరాబాద్‌: ధనాధన్‌ క్రికెట్‌ ఫీవర్‌ మరోసారి సిటీజనుల్ని చుట్టుముట్టనుంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం నగర వ్యాప్తంగా వేదికలు సిద్ధమయ్యాయి. ఒంటరిగా, స్నేహితులతో, సన్నిహితులతో కలిసి, బృందాలుగా వీక్షించేవారి అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారీ స్క్రీన్స్‌ ప్రధాన ఆకర్షణగా, డీజే సంగీతం, రుచికరమైన వంటకాలు, సర్‌ప్రైజ్‌ గిఫ్టులు వంటివి జతగా ఈ వేదికలు క్రికెట్‌ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి.    

బెంగళూరు పంథాలో..   
నగరంలో ఐపీఎల్‌  సీజన్‌ కోసం ప్రత్యక్ష ప్రసారాలను అందించడానికి సిద్ధమయ్యాయి. వీటిలో భారీ స్క్రీన్‌లు, ప్రత్యేక మెనూలు ముఖ్యమైన మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. బెంగళూర్‌లో అండర్‌డాగ్స్‌ వైట్‌ ఫీల్డ్‌ పేరుతో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లేస్‌ ఉంది. అది స్టేడియం తరహా వాతావరణం హై క్వాలిటీ స్క్రీన్స్, సరౌండ్‌ సౌండ్‌తో అలరిస్తోంది. అదే పంథాలో నగరంలోనూ పలు వేదికలు, పార్టీ ప్లేస్‌లు.. క్రికెట్‌ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  

కొండల్లో సందళ్లు.. 
ఐపీఎల్‌ స్క్రీనింగ్‌కు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు వేదికలు పేరొందాయి. జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌ లైవ్‌ 2 భారీ స్క్రీన్స్‌కి ఫేమస్‌. ఇక ప్రోస్ట్‌ బ్రూ పబ్‌  పెద్ద స్క్రీన్‌లతో కూడిన ఒక ప్రసిద్ధ వేదిక. అలాగే జీరో 40 బ్రూవింగ్‌ ఆహ్లాదకరమైన వాతావరణానికి  ప్రసిద్ధి చెందింది. సందడిగా, ఆకర్షణీయంగా ఉండే సెట్టింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఫర్జీ కేఫ్,  హై లైఫ్‌ బ్రూవింగ్‌ కంపెనీ కూడా భారీ స్క్రీన్‌లకు ప్రసిద్ధి చెందింది. హ్యాపీ అవర్స్‌ పేరిట స్పెషల్‌ ఆఫర్లు అందించే అమ్నీసియా స్కై బార్‌ ఓపెన్‌ వాతావరణంలో వీక్షించాలనుకునేవారికి మంచి ఎంపిక.  

హైటెక్‌ సిటీలో.. క్రికెట్‌ సిరి.. 
మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో... సత్వా నాలెడ్జ్‌ సిటీ జెడ్‌ భారీ స్థాయి స్క్రీనింగ్‌లను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతంలోని రష్‌ స్పోర్ట్స్‌ కేఫ్‌..క్రీడా పోటీల వీక్షణకు ప్రత్యేకంగా పేరొందింది.  ఇంటరాక్టివ్‌ గేమింగ్, మ్యాచ్‌ వీక్షణ అనుభవాన్ని అందించేందుకు ఇనార్బిట్‌ మాల్‌లోని స్మాష్‌  సిద్ధమైంది. గోవా వంటకాలకు పేరొందిన ది ఫిషర్‌ మ్యాన్స్‌ వాఫ్స్, బ్రాడ్‌ వే, గచ్చి»ౌలిలోని ఎల్స్‌ వేర్‌ లాంజ్, టికి షాక్‌ మరెన్నో ప్లేసెస్‌ ఆట చూడడాన్ని అపూర్వ అనుభవంగా మార్చేందుకు రెడీ అయ్యాయి.  

సికింద్రాబాద్‌ కూడా జిందాబాద్‌.. 
సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎట్‌ ది బార్‌ నెక్ట్స్‌ డోర్‌ ఎస్‌ఎల్‌ఎన్‌ టెరి్మనస్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్, కొంపల్లిలోని ఓల్డ్‌ ట్రీస్‌ కేఫ్, ఆర్‌ అడ్డాలు లార్జ్‌ స్క్రీన్స్‌కు చిరునామాగా నిలుస్తున్నాయి. ఎల్బీనగర్‌లోని నార్ఫెస్ట్‌ ది దాబా వంటివి మేము సైతం అంటూ సిద్ధమయ్యాయి. 

ఇవి కాకుండా నగరం చుట్టుపక్కల ఫార్మ్‌ హౌజ్‌లు రిసార్ట్స్‌ కూడా ప్రత్యేక స్క్రీనింగ్స్‌తో ఆహా్వనిస్తున్నాయి. మొయినాబాద్‌లోని ఆయనా రిసార్ట్స్‌  సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ ఉన్న రోజున ముందస్తు బుకింగ్స్‌ అవసరం అని గత అనుభవాలు చెబుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement