లక్నోపై సీఎస్‌కే గెలుపు | IPL 2026: CSK VS LSG Live Updates and highlights | Sakshi
Sakshi News home page

లక్నోపై సీఎస్‌కే గెలుపు

May 10 2026 3:12 PM | Updated on May 10 2026 7:54 PM

IPL 2026: CSK VS LSG Live Updates and highlights

ఉర్విల్‌ పటేల్‌ ఊచకోత.. లక్నోను చిత్తు చేసిన సీఎస్‌కే
ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (మే 10) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ (85) ఊచకోత కోశాడు. 

ఆఖర్లో షాబాజ్‌ అహ్మద్‌ (43 నాటౌట్‌) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్‌ చేయలేదు. మిచెల్‌ మార్ష్‌ 10, నికోలస్‌ పూరన్‌ 1, రిషబ్‌ పంత్‌ 15, మార్క్రమ్‌ 6, రఘువంశీ 18, హిమ్మత్‌ సింగ్‌ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్‌ కంబోజ్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే ఆది నుంచే దూకుడుగా ఆడింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్‌ పటేల్‌ (65) పూనక​ం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు. అయితే మధ్యలో సీఎస్‌కే కాస్త తడబాటుకు లోనైంది. సునాయాసంగా గెలుస్తుందనుకుంటే, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చింది. 

చివరి ఓవర్‌ తొలి రెండు బంతులకు శివమ్‌ దూబే (15 నాటౌట్‌) సిక్సర్లు బాది సీఎస్‌కేను విజయతీరాలు దాటించాడు. మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్‌ 28, రుతురాజ్‌ గైక్వాడ్‌ 42, కార్తీక్‌ శర్మ 20, బ్రెవిస్‌ 10, ప్రశాంత్‌ వీర్‌ (18 నాటౌట్‌) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ రాఠీ, షాబాజ్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్‌ ఖాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో లక్నో చాలా క్యాచ్‌లు జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై పూర్తిగా ఆశలు వదులుకుంది. సీఎస్‌కే విషయానికొస్తే.. ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా మారిపోయింది. ఈ గెలుపుతో ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) చేరాయి. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

సంజూ శాంసన్‌ ఔట్‌
3.4వ ఓవర్‌- 45 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. దిగ్వేష్‌ రాఠీ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (28) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.  

లక్నో భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్‌ అహ్మద్‌ (43 నాటౌట్‌) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్‌ చేయలేదు. మిచెల్‌ మార్ష్‌ 10, నికోలస్‌ పూరన్‌ 1, రిషబ్‌ పంత్‌ 15, మార్క్రమ్‌ 6, రఘువంశీ 18, హిమ్మత్‌ సింగ్‌ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్‌ కంబోజ్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశాడు. 

కష్టాల్లో లక్నో
భారీ స్కోర్‌ దిశగా సాగుతుందనుకున్న దశలో లక్నో జట్టు కష్టాల్లో పడింది. ఓవర్టన్‌ వేసిన 10వ ఓవర్‌లో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్టన్‌ తొలి బంతికి ఇంగ్లిస్‌ను (85), నాలుగో బంతికి పంత్‌ను (15) ఔట్‌ చేశాడు. 9.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 116-4గా ఉంది. మార్క్రమ్‌కు జతగా రఘువంశీ క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఇంగ్లిస్‌ ఊచకోత
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. పవర్‌ ప్లేలో ఆ జట్టు ఏకంగా 91 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ వీరవిహారం చేస్తున్నాడు. 25 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. మిచెల్‌ మార్ష్‌ 10 బంతుల్లో 10 పరుగులు చేసి అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లిస్‌కు జతగా పూరన్‌ (1) ఉన్నాడు.

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 10) డబుల్‌ హడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో సీఎస్‌కే, లక్నో తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఐడెన్ మార్క్‌రామ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజూ శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement