
Photo Courtesy: BCCI
ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఆర్సీబీకి అదిరిపోయే వార్త అందింది. ఆ జట్టు సంచలన ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి వచ్చాడు. అతనితో పాటు కేకేఆర్ ఆటగాళ్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ కూడా ఇండియాలో ల్యాండ్ అయినట్లు కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.
Romario Shepherd is on his way for the IPL
A major boost for RCB! ⭐ pic.twitter.com/OB5Uvsg7AL— Cricket Winner (@cricketwinner_) May 14, 2025
ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న మే 17వ తేదీ కేకేఆర్, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం షెపర్డ్, నరైన్, రసెల్ బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సీజన్‌లోనే ఆర్సీబీతో జతకట్టిన షెపర్డ్.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి వార్తల్లోకెక్కాడు. ఈ ఫిఫ్టి ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కాగా.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది. ఈ ఇన్నింగ్స్ తర్వాత షెపర్డ్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిపోయాయి. ఆర్సీబీ అభిమానులు షెపర్డ్‌ను తమ తురుపుముక్కలా భావించడం మొదలు పెట్టారు.
కాగా, కొద్ది రోజుల ముందు వరకు షెపర్డ్ లీగ్ తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత ఉండింది. ఈ దశ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే తేదీల్లోనే వెస్టిండీస్ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన విండీస్ జట్టుకు షెపర్డ్ ఎంపికయ్యాడు. దీంతో అతను ఐపీఎల్‌కు తిరిగి రాడని అంతా అనుకున్నారు. అయితే అతను విండీస్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుని ఐపీఎల్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఐర్లాండ్‌తో విండీస్ వన్డే సిరీస్ మే 21, 23, 25 తేదీల్లో జరుగనుంది.
ప్రస్తుతానికి షెపర్డ్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు కానీ, ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మరో క్వశ్చన్ మార్క్‌గా మారింది. ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే రోజుల్లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు కూడా షెపర్డ్ ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌తో సిరీస్ అంటే విండీస్ క్రికెట్ బోర్డు లైట్‌గా తీసుకుంది కానీ ఇంగ్లండ్‌తో సిరీస్ కాబట్టి షెపర్డ్‌కు తప్పక ఆడాల్సిందేనని పట్టుబట్టవచ్చు. ఈ నేపథ్యంలో షెపర్ట్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఆ జట్టు తదుపరి లెగ్‌లో ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 17), సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.