
వెస్టిండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్‌కు లక్కీ ఛాన్స్!!... 24 ఏళ్ల ఈ పేస్ బౌలర్ త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో షమార్ జోసెఫ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘షమార్.. నీ రాక మాకెంతో సంతోషం. ఐపీఎల్-2024 సందర్భంగా మార్క్ వుడ్ స్థానంలో షమార్ జట్టుతో చేరనున్నాడు’’ అని లక్నో ప్రకటన విడుదల చేసింది.
ఆస్ట్రేలియాపై అదరగొట్టి..
సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన షమార్ జోసెఫ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అడిలైడ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ తొలి బంతికే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు.
స్టీవ్ స్మిత్ రూపంలో అంతర్జాతీయస్థాయిలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అడిలైడ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తీసిన షమార్ జోసెఫ్.. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఎనిమిది వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. కంగారూ గడ్డపై వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ ఫ్రాంఛైజీలు షమార్ జోసెఫ్‌నకు బంపరాఫర్లు ఇస్తున్నాయి. ఇటీవలే అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ధ్రువీకరించింది. కాగా రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కరేబియన్ బౌలర్‌ను లక్నో సొంతం చేసుకుంది.
Shamar, we're so happy to have you 💙🔥@SJoseph70Guyana joins our squad for IPL 2024, replacing Mark Wood 🤝 pic.twitter.com/YPfGQZB18N
— Lucknow Super Giants (@LucknowIPL) February 10, 2024