
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) అంటే చాలు చెలరేగిపోతాడు. ఈ గ్రౌండ్‌లో శుభ్‌మన్‌కు ఎవరికీ లేని అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గిల్ ఇక్కడ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఇరగదీస్తాడు. ఇక్కడ అతనికి పట్టపగ్గాలు ఉండవు. తాజాగా మరోసారి ఇది నిరూపితమైంది.
నిన్న (ఏప్రిల్ 4) పంజాబ్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో గిల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మోదీ స్టేడియంలో గిల్ ఆడిన క్లాసీ ఇన్నింగ్స్‌ల్లో ఇదీ ఒకటి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ.. గిల్ ఇన్నింగ్స్ ఆందరినీ ఆకట్టుకుంది.
Shubman Gill at Narendra Modi stadium in IPL:
— CricketMAN2 (@ImTanujSingh) April 4, 2024
9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48).
15 innings, 825 runs, 68.75 average, 159.26 strike Rate - This is Incridible from Gill. ⭐ pic.twitter.com/mbUmoe9GJb
నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇక్కడ అతను 15 ఇన్నింగ్స్‌ల్లో 159.26 స్ట్రయిక్‌రేట్‌తో 68.75 సగటున 825 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్దసెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో బహుశా ఏ క్రికెటర్ తన హోం గ్రౌండ్‌లో ఈ స్థాయి చెలరేగి ఉండడు.
మోదీ స్టేడియంలో గిల్ చేసిన స్కోర్లు..
9(8), 43(38), 45*(43), 63(36), 39(31), 39(31), 45(34), 56(34), 6(7), 94*(51), 101(58), 129(60), 39(20), 31(22), 36(28), 89*(48)
కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో గిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్‌ను గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.