
Photo: IPL Twitter
ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. వద్దన్న రికార్డులు వెల్లువలా వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
Photo: IPL Twitter
అయితే ధోని మాత్రం సిక్సర్ల విషయంలో ఒక రికార్డు అందుకున్నాడు. సీఎస్‌కే తరపున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో భాగంగా జోష్ లిటిల్ బౌలింగ్‌లో డీప్‌స్వ్కేర్‌లెగ్ దిశగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. ధోని ఖాతాలో ఇది 230వ సిక్సర్ కాగా.. సీఎస్‌కే తరపున 200వ సిక్సర్. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
Photo: IPL Twitter
ఇంతకముందు ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో క్రిస్ గేల్(ఆర్‌సీబీ-239 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(ఆర్‌సీబీ-238 సిక్సర్లు), కీరన్ పొలార్డ్(223 సిక్సర్లు- ముంబై ఇండియన్స్), విరాట్ కోహ్లి(218 సిక్సర్లు-ఆర్‌సీబీ)లు ఉన్నారు. తాజాగా ధోని(200 సిక్సర్లు- సీఎస్‌కే) వీరి సరసన నిలిచాడు.ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధోని ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ధోనికి ఎవరు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ముంబై ఇండియన్స్ తరపున కీరన్ పొలార్డ్ 33 సిక్సర్లతో ధోనికి చాలా దూరంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్‌లో ఏడు బంతుల్లో 14 పరుగులు చేసిన ధోని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. సీఎస్‌కే విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ (63) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
Maahi maar raha hai 💥🔥#IPL2023#cskvsgt pic.twitter.com/LErfszz1cA
— Deepak K (@deepakkumar_dpk) March 31, 2023