IPL 2023: After 28 Matches Player Of The Match Award Repeated - Sakshi
Sakshi News home page

IPL 2023: ఎట్టకేలకు 28 మ్యాచ్‌ల తర్వాత రిపీటైంది..! 

Published Sat, Apr 22 2023 12:14 PM

IPL 2023: After 28 Matches Player Of The Match Award Repeated - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో తొలిసారి ఓ సీన్‌ రిపీటైంది. సన్‌రైజర్స్‌-చెన్నైసూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్‌ 21) జరిగిన మ్యాచ్‌ ఈ రిపీటెడ్‌ సీన్‌కు వేదికైంది. ఇంతకీ ఏంటా రిపీటైన సీన్‌ అనుకుంటున్నారా..? ఇది  చదవండి. 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మొట్టమొదటిసారి 28వ మ్యాచ్‌ వరకు ఒక్క ప్లేయర్‌కు కూడా మ్యాన్‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌ అవార్డు రెండోసారి దక్కలేదు. అయితే నిన్న జరిగిన లీగ్‌ 29వ మ్యాచ్‌లో ఈ ఆనవాయితీకి బ్రేక్‌ పడింది.

ప్రస్తుత సీజన్‌లో తొలిసారి ఓ ప్లేయర్‌ రిపీటెడ్‌గా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. లీగ్‌ 12వ మ్యాచ్‌లో (ముంబై) తొలిసారి ఈ సీజన్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న రవీంద్ర జడేజా, నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్‌ చేసిన జడ్డూ.. కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినందుకు గాను అతన్ని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది.

జడేజా టైట్‌ బౌలింగ్‌, డెవాన్‌ కాన్వే (77 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఫిఫ్టి కారణంగా సీఎస్‌కే..సన్‌రైజర్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో పసుపు దండు 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్‌ రాయల్స్‌ (1.043), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

కాగా, గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకుని ఆసీస్‌తో ఇటీవల జరిగిన టెస్ట్‌ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. పునరాగమనంలో అదరగొడుతూ.. ఇప్పటివరకు (రీఎంట్రీలో) ఏకంగా 5 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు, ఓ ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

ఐపీఎల్‌ 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు విన్నర్ల వివరాలు...

  1. సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌: రషీద్‌ ఖాన్‌ (గుజరాత్‌)
  2. పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌: అర్షదీప్‌ సింగ్‌ (పంజాబ్‌)
  3. లక్నో వర్సెస్‌ ఢిల్లీ: మార్క్‌ వుడ్‌ (లక్నో)
  4. రాజస్థాన్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌: జోస్‌ బట్లర్‌ (రాజస్థాన్‌)
  5. ఆర్సీబీ వర్సెస్‌ ముంబై: డుప్లెసిస్‌ (ఆర్సీబీ)
  6. సీఎస్‌కే వర్సెస్‌ లక్నో: మొయిన్‌ అలీ (సీఎస్‌కే)
  7. గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ: సాయి సుదర్శన్‌ (గుజరాత్‌)
  8. పంజాబ్‌ వర్సెస్‌ రాజస్థాన్‌: నాథన్‌ ఇల్లిస్‌ (పంజాబ్‌)
  9. కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: శార్దూల్‌ ఠాకూర్‌ (కేకేఆర్‌)
  10. లక్నో వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కృనాల్‌ పాండ్యా (లక్నో)
  11. రాజస్థాన్‌ వర్సెస్‌ ఢిల్లీ: యశస్వి జస్వాల్‌ (రాజస్థాన్‌)
  12. సీఎస్‌కే వర్సెస్‌ ముంబై: రవీంద్ర జడేజా (సీఎస్‌కే)
  13. కేకేఆర్‌ వర్సెస్‌ గుజరాత్‌: రింకూ సింగ్‌ (కేకేఆర్‌)
  14. సన్‌రైజర్స్‌వర్సెస్‌ పంజాబ్‌: శిఖర్‌ ధవన్‌ (పంజాబ్‌)
  15. లక్నో వర్సెస్‌ ఆర్సీబీ: పూరన్‌ (లక్నో)
  16. ముంబై వర్సెస్‌ ఢిల్లీ: రోహిత్‌ శర్మ (ముంబై)
  17. రాజస్థాన్‌ వర్సెస్‌ సీఎస్‌కే: అశ్విన్‌ (రాజస్థాన్‌)
  18. గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌: మోహిత్‌ శర్మ గుజరాత్‌)
  19. సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కేకేఆర్‌: హ్యారీ బ్రూక్‌ (సన్‌రైజర్స్‌)
  20. ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ: విరాట్‌ కోహ్లి (ఆర్సీబీ)
  21. పంజాబ్‌ వర్సెస్‌ లక్నో: సికందర్‌ రజా (పంజాబ్‌)
  22. ముంబై వర్సెస్‌ కేకేఆర్‌: వెంకటేశ్‌ అయ్యర్‌ (కేకేఆర్‌)
  23. రాజస్థాన్‌ వర్సెస్‌ గుజరాత్‌: షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (రాజస్థాన్‌)
  24. సీఎస్‌కే వర్సెస్‌ ఆర్సీబీ: డెవాన్‌ కాన్వే (సీఎస్‌కే)
  25. ముంబై వర్సెస్‌ సన్‌రైజర్స్‌: కెమారూన్‌ గ్రీన్‌ (ముంబై)
  26. లక్నో వర్సెస్‌ రాజస్థాన్‌: మార్కస్‌ స్టోయినిస్‌ (లక్నో)
  27. ఆర్సీబీ వర్సెస్‌ పంజాబ్‌: మహ్మద్‌ సిరాజ్‌ (ఆర్సీబీ)
  28. ఢిల్లీ వర్సెస్‌ కేకేఆర్‌: ఇషాంత్‌ శర్మ (ఢిల్లీ)
  29. సీఎస్‌కే వర్సెస్‌ సన్‌రైజర్స్‌: జడేజా (సీఎస్‌కే)

రీఎంట్రీలో జడేజా గెలుచుకున్న మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు..

  1. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో ఆసీస్‌తో తొలి టెస్ట్‌
  2. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో ఆసీస్‌తో రెండో టెస్ట్‌
  3. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ (సంయుక్తంగా)
  4. ఆసీస్‌తో తొలి వన్డే
  5. ఐపీఎల్‌ 2023లో ముంబై ఇండియన్స్‌పై
  6. ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్‌పై 

Advertisement
Advertisement