Breadcrumb
Live Updates
IPL 2022: ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం
ఆర్సీబీపై రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం
రాజస్తాన్ 29 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.
అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. కుల్దీప్ సేన్ (4/20) రాణించగా, అశ్విన్ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
92 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన షబాజ్ ఆహ్మద్..అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి ఇంకా 24 బంతుల్లో 51 పరుగులు కావాలి.
15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 90/6
15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో షబాజ్ ఆహ్మద్(17),హాసరంగా(8) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ విజయానికి ఇంకా 27 బంతుల్లో 55 పరుగులు కావాలి.
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
66 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేపిన ప్రభుదేశాయి.. అశ్విన్ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 78 పరుగులు కావాలి. క్రీజులో కార్తీక్, షబాజ్ ఆహ్మద్ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
58 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పటిదార్.. అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కోహ్లి(9),డుప్లెసిస్(23),మాక్స్వెల్ డకౌట్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది.
ఆర్సీబీ టార్గెట్ 145 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, సిరాజ్, హాసరంగా చెరో రెండు వికెట్లు,హర్షల్ పటేల్ ఒక్క వికెట్ సాధించాడు.
ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
103 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 3 పరుగలు చేసిన హెట్‌మైర్.. హాసరంగా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్ 110/ 6
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
99 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన మిచెల్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
68 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శాంసన్.. హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
4 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్: 33/3
33 పరుగలకే మూడు రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అశ్విన్ ఔట్ కాగా, హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ పెవిలియన్‌కు చేరాడు.4 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్: 33/3
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్
11 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 7 పరుగలు చేసిన పడిక్కల్.. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో బట్లర్, అశ్విన్ ఉన్నారు. 2 ఓవర్లకు రాజస్తాన్ రాయల్స్ స్కోర్ 19/1
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ఐపీఎల్-2022లో రాయల్స్ పోరుకు రంగం సిద్దమైంది. ఏంసీఏ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఆర్సీబీ
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్తాన్ రాయల్స్
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
Related News By Category
Related News By Tags
-
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్ షెడ్యూల్: రాజీవ్ శుక్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ...
-
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!
భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగ...
-
IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.....
-
ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది. ట...
-
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల...


