IPL 2022: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్‌ చేరాలంటే! | IPL 2022 MI Vs CSK: Can Mumbai Indians Team Qualify For Playoffs | Sakshi
Sakshi News home page

CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్‌ చేరాలంటే!

Apr 22 2022 11:37 AM | Updated on Apr 22 2022 12:51 PM

IPL 2022 MI Vs CSK: Can Mumbai Indians Team Qualify For Playoffs - Sakshi

ముంబై ఇండియన్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్‌ చేరుకుంటుందా?

IPL 2022 CSK Vs MI: ఐపీఎల్‌-2022.. ముంబై ఇండియన్స్‌ జట్టుకు అస్సలు కలిసిరావడం లేదు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా అప్రతహిత జైత్రయాత్ర కొనసాగిస్తూ.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న రోహిత్‌ శర్మకు క్యాష్‌ రిచ్‌లీగ్‌లో మాత్రం వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఈసారి ఆడిన తొలి ఏడు మ్యాచ్‌లలోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన తొలి జట్టుగా రోహిత్‌ సేన నిలిచింది.

ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబై దాదాపు ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించినట్లే! ఎందుకంటే ఇప్పటికే ఆడిన మ్యాచ్‌లలో ఏడింటికి ఏడింట ఓడిపోయి సున్నా పాయింట్ల(నెట్‌ రన్‌రేటు: -0.892)తో అట్టడుగున ఉంది. ఇక మిగిలినవి ఏడు మ్యాచ్‌లు. 

వీటిలో అన్ని మ్యాచ్‌లు గెలిచినా ముంబైకి కేవలం 14 పాయింట్లే వస్తాయి. అంతేకాదు ఈ ఏడు మ్యాచ్‌లలోనూ నెట్‌ రన్‌రేటు భారీగా ఉండాలి. అదే సమయంలో మిగతా తొమ్మిది జట్ల జయాపజయాలు కూడా ప్రభావం చూపుతాయి.

కాబట్టి ఇప్పుడు మిగిలిన అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడం సహా తమతో పాటు సమాన విజయాలు సాధించిన జట్ల రన్‌రేటు తక్కువగా ఉంటేనే ముంబై ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్‌కే మినహా మిగతా జట్లన్నీ కనీసం మూడేసి విజయాలు సాధించి రేసులో ఉన్నాయి. రన్‌రేటు పరంగానూ మెరుగైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఏదో అద్భుతం జరిగితే తప్ప ముంబై ప్లే ఆఫ్‌ చేరడం అసాధ్యం. 

కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్‌లలో లక్నో సూపర్‌జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడునుంది. 

చదవండి: Rohit Sharma: ఆఖరి వరకు పోరాడాం.. కానీ ధోని మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement