
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లక్నో, అహ్మదాబాద్ పేరుతో కొత్త ఫ్రాంచైజీలు రావడంతో ఐపీఎల్ 2022 మరింత రంజుగా మారింది. ఇక ఇదే చివరి మెగావేలమని.. తర్వాత ఫ్రాంచైజీలు సొంత సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక నవంబర్ 30వ తేదీన ఆయా ఫ్రాంచైజీలు తమ దగ్గరే అట్టిపెట్టుకోనున్న(రిటైన్) జాబితాను సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి.
చదవండి: మరీ 16 కోట్లా.. పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం..
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ గురించి ఒక ఆసక్తికర సమాచారం అందింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కేఎల్ రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్‌గా తీసుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం రాహుల్‌కు రూ.20 కోట్ల పైనే మూటజెప్పనున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఇంతవరకు ఏ ఆటగాడు ఇంతమొత్తం పొందలేదు. ఈ సమాచారం నిజమని తేలితే ఐపీఎల్ చరిత్రలో అధికమొత్తం దక్కించుకున్న తొలి ఆటగాడిగా.. కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోనున్నాడు.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కింగ్స్ పంజాబ్ అతన్ని వదులుకోవడానికి ఇష్టపడనప్పటికి.. రాహుల్ కొత్త జట్టులోకి వస్తే మాత్రం పెద్ద మొత్తం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్‌ను పంజాబ్ రిటైన్ చేసుకున్నప్పటికీ బీసీసీఐ నిబంధనల కోసం మొదటి రిటెన్షన్ కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో పంజాబ్‌కు రాహుల్‌ను రిటైన్ చేసుకునే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇక రాహుల్ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే జనవరిలో జరగనున్న మెగావేలం వరకు ఆగాల్సిందే.
చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్ అనౌన్స్‌మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లికి అనధికారిక లెక్కల ప్రకారం 2018-21 సీజన్‌కు గానూ రూ.17 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్‌లో కోహ్లికి అందిస్తున్న పారితోషికం అధిక మొత్తం కావడం విశేషం. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు సాధించి బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ.. జట్టును విజేతగా నిలపాలన్న అతడి కోరిక మాత్రం నెరవేరలేదు.