Tata IPL 2022 DC VS RCB: Head To Head Records Of Royal Challengers Bangalore Vs Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL DC Vs RCB Records: ఢిల్లీతో 'ఢీ'కి రెడీ అంటున్న ఆర్సీబీ.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Apr 16 2022 2:04 PM | Updated on Apr 16 2022 3:22 PM

IPL 2022: DC VS RCB Head To Head Records - Sakshi

DC VS RCB: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 16) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. వాంఖడే వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో డీసీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో రెండిటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో (4 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉండగా, ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 2 అపజయాలతో ఆరో స్థానంలో (6 పాయింట్లు)  కొనసాగుతుంది. 

ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే.. ఢిల్లీపై ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఎదురెదురు పడిన 27 సందర్భాల్లో ఆర్సీబీ 16, ఢిల్లీ 10 సార్లు విజయాలు నమోదు చేశాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో రెండు సార్లు ఆర్సీబీనే విజయం వరించింది. ఇక నేటి మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగవచ్చు. 

ఢిల్లీ.. గత మ్యాచ్‌లో ఆడిన రోవమన్‌ పావెల్‌ను పక్కకు పెట్టి, గాయం నుంచి ​కోలుకున్న మిచెల్‌ మార్ష్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉండగా, ఆర్సీబీ గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆకాశ్‌దీప్‌ను తప్పించి సిద్ధార్థ్‌ కౌల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇక ప్రస్తుత సీజన్‌లో టాస్‌ గెలిచిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటుండటంతో నేటి మ్యాచ్‌లో కూడా టాస్‌ కీలకం కానుంది.    

తుది జ‌ట్టు (అంచనా): 
ఢిల్లీ క్యాపిట‌ల్స్ : పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌, రిషబ్ పంత్, మిచెల్‌ మార్ష్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, సుయాష్‌ ప్రభుదేశాయ్‌, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, జోష్‌ హేజిల్‌వుడ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌
చదవండి: IPL 2022: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఆటగాళ్లంతా సేఫ్..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement