ఆ భారత​ పేసర్‌ కూడా బుమ్రా స్థాయి బౌలరే

IPL 2021:Bishop On Reasons Behind Bumrahs Success Across Formats - Sakshi

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి ముంబై ఇండియన్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్‌ బుమ్రాపై వెస్టిండీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌ ప్రశంసలు కురిపించాడు. స్లాగ్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కట్టడి చేసిన విధానం అమోఘమన్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్‌ తీసి 14 పరుగులే ఇచ్చిన బుమ్రా భారత్‌కు దొరికిన ఒక అదృష్టమన్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన బిషప్‌.. అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఒక సెన్సేషనల్‌ బౌలర్‌ బుమ్రా అని ప్రశంసించాడు. అందుకు గల కారణాలు వెల్లడించాడు ఈ మాజీ విండీస్‌ దిగ్గజం.

‘చాలాకాలం కెరీర్‌ ఆరంభించిన తర్వాత ఓ దశలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.  ఆ తర్వాత తన బౌలింగ్‌ను గాడిలో పెట్టడానికి పరుగులు పెట్టాడు. మంచి రిథమ్‌ను అందుకున్నాడు. అసలు పేస్‌ బౌలింగ్‌లో కచ్చితత్వాన్ని సాధించడంపై ఫోకస్‌ పెట్టాడు.. సక్సెస్‌ చూశాడు. స్లో బాల్స్‌ ఎలా వేయాలి. ఆఫ్‌ కటర్స్‌ ఎలా వేయాలి, యార్కర్లు ఎక్కడ సంధించాలి. లెంగ్త్‌ బాల్స్‌ను ఎప్పుడు వేయాలి అనే విషయాలను బాగా అర్థం చేసుకున్నాడు.

పేస్‌ బౌలింగ్‌ను అతను అర్థం చేసుకున్న అమోఘం. ఇక భారత బౌలర్లలో బుమ్రా స్థాయి బౌలరే భువనేశ్వర్‌ కుమార్‌. ఇద్దరికీ పోలికలున్నాయి. అతని అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృష్టి చేస్తాడు. బౌలింగ్‌ వేసేటప్పుడు తన ఆలోచనతో భిన్నమైన బంతుల్ని వేస్తాడు. అతను బుమ్రా కంటే మంచి పేసర్‌ కాకపోవచ్చు. బుమ్రా బౌలింగ్‌లో కంట్రోల్‌ ఉంటుంది. భువీ బౌలింగ్‌లో అది లోపిస్తుంది. అందుకే ఇద్దరిలో బుమ్రానే మంచి బౌలర్‌. అన్ని ఫార్మాట్లు ఆడుతూ దానికి తగ్గట్టు బౌలింగ్‌ చేయడం, అదే సమయంలో ఫిట్‌గా ఉండటాన్ని ఊహించుకోలేకపోతున్నా’ అని పేర్కొన్నాడు.  ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో బుమ్రా మరొకసారి కీలక పాత్ర పోషిస్తాడని బిషప్‌ అభిప్రాయపడ్డాడు. 

ఇక్కడ చదవండి: టీవీలో చూడట్లేదా ఏంటి.. నేను ప్రిపేరయ్యే ఉన్నా: ధవన్‌
‘క్రికెట్‌ చరిత్రలోనే అది అత్యంత చెత్త రూల్‌’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top