పంజాబ్‌ కింగ్స్‌ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా! | IPL 2021:Twitter Trolls Punjab Kings For Copying RCB Old Jersey | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ కింగ్స్‌ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా!

Mar 30 2021 4:00 PM | Updated on Mar 30 2021 10:11 PM

Twitter Trolls Punjab Kings For Copying RCB Old Jersey In IPL 2021 - Sakshi

ముంబై: ఐపీఎల్‌ 2021 సందడి షురూ అయింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ నూతన జెర్సీలను రిలీజ్‌ చేయగా తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ సరికొత్త డిజైన్‌తో రూపొందిన జెర్సీని మంగళవారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా గోల్డెన్‌ స్ట్రిప్‌లతో రెడ్‌ జెర్సీని తయారు చేశారు. లోటస్‌ హెర్బల్‌, ఎబిక్స్‌ క్యాష్‌ పంజాబ్‌ కింగ్స్‌కు స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. 

కాగా కేకేఆర్‌, ఆర్‌సీబీ తర్వాత గోల్డెన్‌ కలర్‌ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే కావడం విశేషం. ఈ ఏడాది పేరు మార్చుకున్న పంజాబ్‌(గతంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌) సరికొత్త మార్పులతో రాబోయే సీజన్‌కు సన్నద్ధమవుతోంది. కాగా కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌ ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ 


అయితే పంజాబ్‌ కింగ్స్‌ కొత్త జెర్సీపై సోషల్‌ మీడియాలో అప్పుడే ట్రోల్స్‌ మొదలయ్యాయి. రోరింగ్‌ లయన్‌ గోల్డెన్‌ షీల్డ్‌తో ఉన్న పంజాబ్‌ జెర్సీ గతంలో ఆర్‌సీబీ వాడిన జెర్సీని గుర్తుకు తెస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ''ఆర్‌సీబీ వాడిన జెర్సీని వాడారు.. మనకు కలిసి రాకపోవచ్చు.. 2008లో ఆర్‌సీబీ ఇలాంటి జెర్సీతోనే బరిలోకి దిగింది.. అప్పుడు వారిని దురదృష్టం వెంటాడింది.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది.. కనీసం సొంత జెర్సీ కూడా తయారు చేసుకోలేని దుస్థుతిలో ఉన్నారా..'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: 
ఐపీఎల్‌ 2021: భారీ అంచనాల నడుమ ఆర్సీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement