ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై సత్యన్‌ విజయం 

Indian Table Tennis No1 Satyan Gnanashekaran Won Match Vs World 6th Rank - Sakshi

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ సంచలనం సృష్టించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సత్యన్‌ తొలి రౌండ్‌లో 6–11, 12–10, 11–9, 12–10తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జార్జిక్‌ డార్కో (స్లొవేనియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టాప్‌–10 ర్యాంకింగ్స్‌ లోని క్రీడాకారుడిని ఓడించడం సత్యన్‌ కెరీర్‌లో ఇది రెండోసారి.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top