టైబ్రేక్‌లో నెగ్గిన భారత గ్రాండ్‌మాస్టర్
నిహాల్ సరీన్ పరాజయం
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రజ్ఞానంద మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తెమూర్ కుయ్»ొకరోవ్ (ఆ్రస్టేలియా)తో గురువారం జరిగిన ‘టైబ్రేక్’లో ప్రజ్ఞానంద 4–2తో విజయం సాధించాడు. వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయిచేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు.
నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ఓడిపోయాడు. బరిలో నిలవాలంటే రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో తెమూర్‌ను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో గెలుపొంది 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో నెగ్గి 4–2తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
భారత్‌కే చెందిన విదిత్, నారాయణన్, ప్రాణేశ్, ప్రణవ్ కూడా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లగా... నిహాల్ సరీన్, కార్తికేయన్ మురళీలకు నిరాశ ఎదురైంది. టైబ్రేక్‌లో విదిత్ 1.5–0.5తో ఫౌస్టోనో (అర్జెంటీనా)పై, నారాయణన్ 4–2తో వితియుగోవ్ (ఇంగ్లండ్)పై, ప్రాణేశ్ 2–0తోదిమిత్రిజ్ (జర్మనీ)పై, ప్రణవ్ 2–0తో తారి ఆర్యన్ (నార్వే)పై విజయం సాధించారు.


