ఆరంభం అదిరింది.. శ్రీలంక‌ను చిత్తు చేసిన భార‌త్‌ | India won the first T20 match by 43 runs | Sakshi
Sakshi News home page

IND vs SL: ఆరంభం అదిరింది.. శ్రీలంక‌ను చిత్తు చేసిన భార‌త్‌

Jul 28 2024 4:39 AM | Updated on Jul 28 2024 7:05 AM

India won the first T20 match by 43 runs

తొలి టి20 మ్యాచ్‌లో  43 పరుగులతో గెలిచిన భారత్‌

చెలరేగిన సూర్యకుమార్, పంత్‌

8 బంతుల్లో 3 వికెట్లు తీసిన పరాగ్‌

నిసాంక మెరుపులు వృథా

నేడు రెండో టి20  

పల్లెకెలె: టి20 ప్రపంచ చాంపియన్‌ భారత్‌... శ్రీలంక పర్యటనలో శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ బృందం 43 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామం లేకుండా నేడే రెండో టి20 మ్యాచ్‌ జరగనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీస్కోరు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ సూర్యకుమార్‌ (26 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (33 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. పతిరణకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు నిసాంక (48 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (27 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఒకదశలో భారత శిబిరాన్ని వణికించేలా మెరిపించారు. రియాన్‌ పరాగ్‌ (1.2–0–5–3) బంతితో మ్యాజిక్‌ చేశాడు. అర్‌‡్షదీప్‌ (2/24), అక్షర్‌ పటేల్‌ (2/38) కీలక వికెట్లు తీశారు. 

జైస్వాల్, గిల్‌ మెరుపులతో... 
ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (21 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (16 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌తో భారత్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. ఉన్నది కాసేపే అయినా ఇద్దరు పోటీపడి బౌండరీలు బాదడంతో 4వ ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. పవర్‌ ప్లేలో పవర్‌ చూపిన ఓపెనర్లిద్దరిని లంక బౌలర్లు వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చారు. 

మదుషంక వేసిన ఆరో ఓవర్లో శుబ్‌మన్‌ రెండు ఫోర్లు, డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. తొలి ఐదు బంతుల్లోనే 15 పరుగులు రాగా... అదే ఊపులో ఆఖరి బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయతి్నంచగా, మిడాన్‌లో ఉన్న ఫెర్నాండో క్యాచ్‌ పట్టడంతో గిల్‌ వెనుదిరిగాడు. 6 ఓవర్లలో 74/1 స్కోరుతో ఉన్న భారత్‌కు తర్వాతి బంతి మరో దెబ్బతీసింది. హసరంగ వేసిన ఏడో ఓవర్‌ తొలిబంతికి జోరుమీదున్న జైస్వాల్‌ స్టంపౌట్‌ అయ్యాడు.  

సూర్య ఫిఫ్టీ... 
ఈ ఊరట కాస్తా ఆ రెండు బంతులకే పరిమితమైంది. తర్వాత దశను హార్డ్‌ హిట్టర్లు సూర్యకుమార్, రిషభ్‌ పంత్‌ మొదలుపెట్టారు. దీంతో పరుగుల్లో వేగం, బ్యాటింగ్‌లో దూకుడు మరింత పెరిగిందే తప్ప తగ్గనేలేదు. 8.4 ఓవర్లోనే భారత్‌ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ స్ట్రోక్‌ ప్లేతో పదేపదే బౌండరీలకు తరలించాడు. చెత్త బంతులు ఎదురైతే సిక్స్‌లుగా బాదేశాడు. 

ఈ మెరుపులతో అతని అర్ధశతకం 22 బంతుల్లోనే పూర్తవగా, 13.1 ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. కానీ తర్వాతి బంతికి పతిరణ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కెపె్టన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. హార్దిక్‌ పాండ్యా (9), పరాగ్‌ (7) విఫలమైనప్పటికీ పంత్‌ తనశైలి ఆటతీరుతో జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. పరుగు తేడాతో అర్ధసెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.  

చకచకా లక్ష్యం వైపు... అంతలోనే! 
శ్రీలంక కూడా లక్ష్యానికి తగ్గ దూకుడుతోనే బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌ మెండీస్‌  మెరుపులతో సగటున ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో లంక ఇన్నింగ్స్‌ దూసుకెళ్లింది. 5.1 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. నిసాంక భారీషాట్లతో విరుచుకుపడగా, మెండీస్‌ బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టాడు. జట్టు స్కోరు 84 వద్ద అర్ష్‌దీప్‌... మెండిస్‌ను అవుట్‌ చేసి తొలివికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. 

తర్వాత కుశాల్‌ పెరీరా (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) అండతో నిసాంక మరింతగా రెచి్చపోయాడు. 14 ఓవర్లదాకా ఎంతవేగంగా లక్ష్యం వైపు దూసుకొచి్చంతో... నిసాంక అవుటయ్యాక అంతే వేగంగా లంక ఇన్నింగ్స్‌ పతనమైంది. 140 స్కోరు వద్ద నిసాంక రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 36 బంతుల్లో 74 పరుగుల సమీకరణం ఏమంత కష్టం కాకపోయినా... భారత బౌలర్లు పట్టుబిగించడంతో అనూహ్యంగా మరో 30 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయి లంక 170 పరుగులకే ఆలౌటైంది.
 
స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (స్టంప్డ్‌) కుశాల్‌ మెండిస్‌ (బి) హసరంగ 40; గిల్‌ (సి) ఫెర్నాండో (బి) మదుషంక 34; సూర్యకుమార్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 58; పంత్‌ (బి) పతిరణ 49; పాండ్యా (బి) పతిరణ 9; పరాగ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 7; రింకూ సింగ్‌ (బి) ఫెర్నాండో 1; అక్షర్‌ (నాటౌట్‌) 10; అర్‌‡్షదీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–74, 2–74, 3–150, 4–176, 5–192, 6–201, 7–206. బౌలింగ్‌: మదుషంక 3–0–45–1, అసిత ఫెర్నాండో 4–0–47–1, తీక్షణ 4–0–44–0, హసరంగ 4–0–28–1, కమిండు మెండీస్‌ 1–0–9–0, పతిరణ 4–0–40–4. 
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (బి) అక్షర్‌ 79; కుశాల్‌ మెండిస్‌ (సి) జైస్వాల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 45; పెరీరా (సి) బిష్ణోయ్‌ (బి) అక్షర్‌ 20; కమిండు మెండిస్‌ (బి) పరాగ్‌ 12; అసలంక (సి) జైస్వాల్‌ (బి) బిష్ణోయ్‌ 0; షనక (రనౌట్‌) 0; హసరంగ (సి) పరాగ్‌ (బి) అర్‌‡్షదీప్‌ 2; తీక్షణ (బి) పరాగ్‌ 2; పతిరణ (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 6; ఫెర్నాండో (నాటౌట్‌) 0; మదుషంక (బి) పరాగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 170. వికెట్ల పతనం: 1–84, 2–140, 3–149, 5–160, 6–161, 7–163, 8–170, 9–170, 10–170. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 3–0–24–2, సిరాజ్‌ 3–0–23–1, అక్షర్‌ 4–0–38–2, రవి బిష్ణోయ్‌ 4–0–37–1, పాండ్యా 4–0–41–0, పరాగ్‌ 1.2–0–5–3.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement