ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు

India women beat Egypt 3-1 to reach World team table tennis - Sakshi

ఈజిప్ట్‌పై 3–1తో విజయం

రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన శ్రీజ

చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలె, రీత్‌ టెనిసన్, స్వస్తిక ఘోష్‌లతో కూడిన భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్‌–5 చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–1తో ఈజిప్ట్‌ను ఓడించింది.

తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్‌ శ్రీజ 11–6, 11–4, 11–1తో హనా గోడాపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో మనిక 8–11, 11–6, 11–7, 2–11, 11–8తో దీనా మెష్రఫ్‌ను ఓడించడంతో భారత్‌ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో దియా 11–5, 10–12, 11–9, 9–11, 4–11తో యుస్రా హెల్మీ చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 11–8, 11–8, 9–11, 11–6తో దీనా మెష్రఫ్‌పై గెలుపొందడంతో భారత విజయం ఖరారైంది. నాలుగు జట్లున్న గ్రూప్‌–5లో భారత్‌ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, జర్మనీ ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top