Breadcrumb
Live Updates
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు అప్డేట్స్
టీమిండియా పేసర్ల ధాటికి లంక జట్టు విలవిల
టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోర్‌కు కట్టడి చేసిన ఆనందం లంకేయులకు ఎంతో సేపు మిగల్లేదు. భారత బౌలర్లు బుమ్రా (3/15), షమీ (2/ 18), అక్షర్ పటేల్ (1/21)ల ధాటికి లంక జట్టు విలవిలలాడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో కూరకుపోయింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు.
ఐదో వికెట్‌ను కోల్పోయిన శ్రీలంక..
50 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన అసలంక.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
28 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో ధనంజయ డి సిల్వా ఎల్బీగా వెనుదిరిగాడు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక ..
శ్రీలంక మూడో వికెట్‌ను కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో కరుణ రత్నే క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 20/3
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
14 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన తిరిమన్నె.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో కరుణరత్నే, మాథ్యూస్ ఉన్నారు.
తొలి వికెట్‌కోల్పోయిన శ్రీలంక
పింక్ బాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక మొదటి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కుశాల్ మెండిస్(2).. శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.మూడు ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు భారత్ ఆలౌట్
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(92) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు.
భారత బ్యాటర్లలో పంత్(39),విహారి(31),కోహ్లి(23) పరుగులు సాధించారు.శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డి సిల్వా రెండు వికెట్లు, లక్మల్ ఒక వికెట్ సాధించాడు.
వికెట్ పారేసుకున్న షమీ.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
ప్రవీణ్ జయవిక్రమ బౌలింగ్‌లో డిసిల్వాకు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి మహ్మద్ షమీ (5) ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 229 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శ్రేయస్ (690, బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు.
పెవిలియన్‌కు క్యూ కడుతున్న టీమిండియా బ్యాటర్లు.. ఎనిమిదో వికెట్ డౌన్
లంక బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఓ పక్క శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేస్తుండగా, మిగతా ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకుంటున్నారు. ఇన్నింగ్స్ 50వ ఓవర్లో సురంగ లక్మల్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (9) క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 215/8. క్రీజ్‌లో శ్రేయస్ (60), షమీ ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన భారత్..
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. 13 పరుగులు చేసిన అశ్విన్.. ధనంజయ డి సిల్వా బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 48 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. క్రీజులో అయ్యర్(50), అక్షర్ పటేల్(2) పరుగులతో ఉన్నారు.
47 ఓవర్లకు భారత్ స్కోర్: 177/6
47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(37), అశ్విన్ (11) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్‌ను కోల్పోయిన టీమిండియా.. పంత్ ఔట్
టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. ఎంబుల్దేనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 143 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్(16),జడేజా(4) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. విరాట్ కోహ్లి ఔట్
శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 29 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో పంత్(16), శ్రేయస్ అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
నిలకడగా ఆడుతున్న హనుమ విహారి (81 బంతుల్లో 31; 4 ఫోర్లు) జయవిక్రమ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 76 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లి (23), రిషబ్ పంత్ ఉన్నారు.
21 ఓవర్లకు భారత్ స్కోర్: 67/2
21 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో విహారి(31),కోహ్లి(15) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్
29 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రోహిత్.. లసిత్ ఎంబల్డెనియా బౌలింగ్‌లో ధనుంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో విహారి, కోహ్లి ఉన్నారు.
6 ఓవర్లకు భారత్ స్కోర్: 23/1
శ్రీలంకతో జరగుతోన్న రెండో టెస్టులో టీమిండియా 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(15), విహారి(2) ఉన్నారు.
తొలి వికెట్‌కోల్పోయిన టీమిండియా
బెంగళూరు వేదికగా జరుగుతోన్న పింక్‌బాల్ టెస్టులో భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్(4) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో రోహిత్ శర్మ, విహారి ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పర్యాటక లంక జట్టును ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.
తుదిజట్లు:
భారత్:
మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), హనుమ విహారి, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక:
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లాహిరు తిరుమన్నె, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, నిరోశన్ డిక్విల్లా(వికెట్ కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబల్డెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.
ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు
బెంగళూరు వేదికగా జరగునున్న రెండో టెస్టుకు భారత్- శ్రీలంక సిద్ధమయ్యాయి.
Related News By Category
Related News By Tags
-
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మ...
-
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
భారత మహిళా క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెం...
-
ఈ హెడ్‌కోచ్ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!
గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్‌కోచ్‌ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక...
-
World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహి...
-
రాణించిన అమన్‌జ్యోత్, దీప్తి.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత ...


