IND Vs SA ODI: India Name 16-Member Squad For South Africa ODIs - Sakshi
Sakshi News home page

IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్‌గా ధావన్‌

Oct 2 2022 7:26 PM | Updated on Oct 3 2022 9:33 AM

India name 16 member squad for South Africa ODIs - Sakshi

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్‌ సారథ్యంలోని భారత సీనియర్‌ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా యువ ఆటగాళ్లు రజిత్‌ పటిదార్‌, ముఖేష్‌ కుమార్‌కు తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది.

ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే ఆక్టోబర్‌ 6న లక్నో వేదికగా జరగనుంది.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌:  శిఖర్ ధావన్ (కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ , అవేష్ ఖాన్, మహ్మద్‌ సిరాజ్, దీపక్ చాహర్.

Advertisement
 
Advertisement
Advertisement