Ind vs Aus: Suryakumar Yadav shares video of him playing 'supla shot' - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: సోదరుల కోరిక మేరకు సల్పా షాట్‌.. వీడియో షేర్‌ చేసిన సూర్య

Mar 6 2023 11:15 AM | Updated on Mar 6 2023 11:51 AM

Ind Vs Aus: Suryakumar Yadav Shares Video Himself Playing Supla Shot Viral - Sakshi

Suryakumar Yadav Shares Video: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబైలో గల్లీ క్రికెట్‌ ఆడుతూ సందడి చేశాడు. అభిమానుల కోరిక మేరకు ‘సల్పా షాట్‌’ కొట్టి వారిని అలరించాడు. చిన్నారి ఫ్యాన్స్‌తో సరదాగా గడిపి వారిని సంతోషపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సూర్యకుమార్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

‘‘నా సోదరుల డిమాండ్‌ మేరకు సల్పా షాట్‌’’ అంటూ వీడియోను పంచుకున్నాడు. కాగా మైదానం నలువైపులా షాట్లు బాదుతూ.. మిస్టర్‌ 360గా పేరొందిన సూర్య టీ20 ఫార్మాట్‌లో నంబర్‌ 1గా ఎదిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌తో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. సూర్య ఎంట్రీకి మార్గం సుగమమైంది.

తొలి టెస్టులో విఫలం
అయితే, నాగ్‌పూర్‌ టెస్టులో సూర్య విఫలమయ్యాడు. 20 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో టెస్టుకు అయ్యర్‌ అందుబాటులోకి రావడంతో సూర్యకు విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ టీ20 స్టార్‌.. ప్రస్తుతం స్వస్థలం ముంబైలో ఉన్నాడు. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు మార్చి 9 నుంచి ఆరంభం కానుంది.

ఇదిలా ఉంటే.. శ్రేయస్‌ అ‍య్యర్‌ ఆడిన రెండు టెస్టుల్లో వరుసగా 16, 26 పరుగులు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. ఈ నేపథ్యంలో కొంతమంది మాజీలు శ్రేయస్‌ స్థానంలో సూర్యను ఆడించాలని సూచిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్‌ ప్రయోగం చేయాలని భావిస్తే తప్ప.. సూర్యకు అహ్మదాబాద్‌ టెస్టులో అవకాశం రావడం దాదాపు అసాధ్యం. కాగా గల్లీ క్రికెట్‌లో సల్పా షాట్‌ బాదిన సూర్య ఫన్నీ వీడియో వైరల్‌ అవుతోంది.

చదవండి: Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్‌
ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్‌ మాలిక్‌ ఎక్కడ..? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement