WTC Final 2023: ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర!

If team india win Wtc Final 2023, become 1st team won 3 cricket formats icc titles - Sakshi

లండన్‌ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత జట్టు.. అదే జోరును డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా కొనసాగించి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తోంది. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే... ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందితే.. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టీమిండియా ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో  తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకోగా.. అనంతరం ధోని సారధ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌,2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది. మరోవైపు  డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచినా కూడా అదే రికార్డును లిఖిస్తుంది. ఆస్ట్రేలియా కూడా ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ ట్రోఫీలను సొం‍తం చేసుకుంది.

WTC ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

సబ్‌స్టిట్యూట్స్: సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్.

WTC ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top