వరల్డ్‌కప్‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ఒక్కడే

ICC Confirms Umpires For Cricket World Cup 2023 - Sakshi

అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్‌ 25) ప్రకటించింది. మెగా టోర్నీ కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ ఇవాళే రిలీజ్‌ చేసింది. అంపైర్ల జాబితాలో భారత్‌ నుంచి నితిన్‌ మీనన్‌ ఒక్కడికే ప్రాతినిథ్యం లభించగా.. రిఫరీల్లో సైతం భారత్‌ నుంచి జవగల్‌ శ్రీనాథ్‌ ఒక్కడికే అవకాశం దక్కింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య అక్టోబర్‌ 5న జరిగే టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు భారత​ అంపైర్‌ నితిన్‌ మీనన్‌, శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార ధర్మసేన ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. 

అక్టోబర్‌ 14న జరిగే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు అ​ంపైర్లు, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ ఇవాళే వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు రిచర్డ​్‌ ఇల్లింగ్‌వర్త్‌, మరియాస్‌ ఎరాస్మస్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్‌ కెటిల్‌బోరో థర్డ్‌ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్‌ మ్యాచ్‌ రిఫరీగా ఉంటారు.   

అంపైర్ల వివరాలు..

  • క్రిస్‌ బ్రౌన్‌ (న్యూజిలాండ్‌)
  • కుమార ధర్మసేన (శ్రీలంక)
  • మరియాస్‌ ఎరాస్మస్‌ (సౌతాఫ్రికా)
  • క్రిస్టోఫర్‌ గఫ్ఫానీ (న్యూజిలాండ్‌)
  • మైఖేల్‌ గాఫ్‌ (ఇంగ్లండ్‌)
  • అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌ (సౌతాఫ్రికా)
  • రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌)
  • రిచర్డ్‌ కెటిల్‌బోరో (ఇంగ్లండ్‌)
  • నితిన్‌ మీనన్‌ (ఇండియా)
  • ఎహసాన్‌ రజా (పాకిస్తాన్‌)
  • పాల్‌ రీఫిల్‌ (ఆస్ట్రేలియా)
  • షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్‌ (బంగ్లాదేశ్‌)
  • రాడ్నీ టక్కర్‌ (ఆస్ట్రేలియా)
  • అలెక్స్‌ వార్ఫ్‌ (ఇంగ్లండ్‌)
  • జోయెల్‌ విల్సన్‌ (వెస్టిండీస్‌)
  • పాల్‌ విల్సన్‌ (ఆస్ట్రేలియా)

రిఫరీల జాబితా..
జెఫ్‌ క్రో (న్యూజిలాండ్‌)
ఆండీ పైక్రాఫ్ట్‌ (జింబాబ్వే)
రిచీ రిచర్డ్‌సన్‌ (వెస్టిండీస్‌)
జవగల్‌ శ్రీనాథ్‌ (ఇండియా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top