ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్‌ | Gongadi Trisha Selected To India A Team For England T20 Series - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్‌

Published Wed, Nov 22 2023 7:15 AM

Hyderabad Women Cricketer Gongadi Trisha Selected To India A Team For England T20 Series - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ ‘ఎ’ మహిళల క్రికెట్‌ జట్టుతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కిందని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

17 ఏళ్ల త్రిష ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. భారత్‌ ‘ఎ’–ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్‌ 29న, డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 3న జరుగుతాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement