IPL 2022: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది

Harshal Patel Appeal Faf-Du-Plesis Review Worst Reviews All-Time List - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా కేకేఆర్‌,ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. అప్పటికే హర్షల్‌ పటేల్‌ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్‌ చక్రవర్తికి హర్షల్‌ 16వ ఓవర్‌లో ఆఖరి బంతిని ఫుల్‌టాస్‌గా వేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి వన్‌ స్టప్‌ అయి కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్‌గా ఔట్‌ కాదని తెలిసినప్పటికి.. బంతి వరుణ్‌ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్‌కు తగిలిందేమోనని హర్షల్‌ పటేల్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశాడు.

అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. ఇంతటితో ఊరుకుంటే అయిపోయేది.. కానీ హర్షల్‌ పటేల్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది. ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్‌మన్‌ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్‌ మిడిల్‌లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ''డుప్లెసిస్‌ తీసుకున్న రివ్యూ.. క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది.. బౌలర్‌ కంటే తెలియకపోవచ్చు.. కెప్టెన్‌గా అనుభవం ఉన్న నీకు ఆ రివ్యూ ఎలా తీసుకోవాలనిపించింది డుప్లీ..'' అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

చదవండి: Ravi Shastri: ఉమ్రాన్‌ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్‌ ప్రశంసల వర్షం

IPL 2022: కేకేఆర్‌కు ఆ జట్టు మాజీ ప్లేయర్‌ వార్నింగ్‌.. తేడా వస్తే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top