Sanju Samson: క్యాచ్‌ డ్రాప్‌ చేసిన సంజూ! హార్దిక్‌ పాండ్యా రియాక్షన్‌ వైరల్‌

Hardik Reaction to Sanju Samson Drop Catch Fans Say True Leader - Sakshi

India vs Sri Lanka, 1st T20I- Hardik Pandya- Sanju Samson: చాలా రోజుల తర్వాత తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు టీమిండియా బ్యాటర్‌ సంజూ శాంసన్‌. శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్‌ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, సంజూ తనకు వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.

వాంఖడే మ్యాచ్‌లో మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు 5 పరుగులు మాత్రమే చేశాడు. ధనుంజయ డి సిల్వ బౌలింగ్‌లో దిల్షాన్‌ మధుషంకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చెత్త షాట్‌ సెలక్షన్‌తో విమర్శలు మూటగట్టుకున్నాడు.

క్యాచ్‌ డ్రాప్‌ చేసిన సంజూ
ఇదిలా ఉంటే.. శ్రీలంక ఇన్నింగ్స్‌లో భాగంగా హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ఎటాక్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో బంతికే లంక ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంకను అవుట్‌ చేసే అవకాశం దొరికింది. పాండ్యా బౌలింగ్‌లో నిసాంక బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్‌లో ఉన్న సంజూ డైవ్‌ చేసి మరీ దానిని ఒడిసిపట్టాడు. 

పర్లేదులే! హార్దిక్‌ రియాక్షన్‌ వైరల్‌
కానీ, ఆ తర్వాత బ్యాలెన్స్‌ కోల్పోవడంతో కిందపడ్డ సంజూ చేతిలో నుంచి బంతి జారిపోయింది. అంత కష్టపడ్డా ఫలితం లేకపోవడంతో సంజూ.. నిరాశగా ఓ ‘చిరునవ్వు’ చిందించగా.. అందుకు బదులుగా హార్దిక్‌ ‘‘పర్లేదులే.. ఏం చేస్తాం’’ అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. మామూలుగా అయితే, క్యాచ్‌ డ్రాప్‌ అయితే, పాండ్యా రెస్పాన్స్‌ వేరేలా ఉంటుందన్న విషయం గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. అయితే, ఈసారి మాత్రం దూకుడు ప్రదర్శించకుండా కాస్త నెమ్మదిగా ఉండటం విశేషం. 

నిజమైన నాయకుడంటే ఇలాగే!
ఈ నేపథ్యంలో.. ‘‘నిజమైన నాయకుడి లక్షణం ఇదే పాండ్యా! నువ్వు ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. పాపం.. సంజూ ట్రై చేశాడు. కానీ క్యాచ్‌ జారవిడిచేశాడు. అందులో తన తప్పు పెద్దగా కనిపించడం లేదు. ఏదేమైనా నువ్వు ఈరోజు నిజమైన కెప్టెన్‌వి అనిపించుకున్నావు’’ అంటూ అతడి ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంజూ క్యాచ్‌ డ్రాప్‌నకు పాండ్యా ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. ఇ‍క ఆ తర్వాతి ఓవర్‌కే నిసాంకను అరంగేట్ర బౌలర్‌ శివం మావి పెవిలియన్‌కు పంపాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

చదవండి: Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్‌ వైరల్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top