భార‌త టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. జై షా ఏమ‌న్నాడంటే? | Hardik Pandya to replace Rohit Sharma as T20I captain? | Sakshi
Sakshi News home page

భార‌త టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. జై షా ఏమ‌న్నాడంటే?

Jul 1 2024 5:50 PM | Updated on Jul 1 2024 6:00 PM

Hardik Pandya to replace Rohit Sharma as T20I captain?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఛాంపియ‌న్స్‌గా నిలిచిన అనంత‌రం రోహిత్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. రోహిత్ ఇక‌పై కేవ‌లం వ‌న్డేలు, టెస్టుల్లో భార‌త సార‌థిగా కొన‌సాగ‌నున్నాడు.

ఈ క్ర‌మంలో టీ20ల్లో భార‌త జ‌ట్టు త‌ద‌పరి కెప్టెన్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న అంద‌రి మెద‌డ‌ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. అయితే రోహిత్ వార‌సుడిగా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా భారత జ‌ట్టు ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. పాండ్యాకు కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది.

గతంలో రోహిత్ గైర్హాజరీలో చాలా సిరీస్‌లో భార‌త జ‌ట్టు తాత్కాలిక సార‌థిగా పాండ్యా వ్య‌వ‌హ‌రించాడు. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్‌లో భార‌త జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల‌ను హార్దిక్‌కే అప్ప‌జెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.  తాజాగా భార‌త టీ20 కెప్టెన్సీపై బీసీసీఐ సెక్ర‌ట‌రీ జైషా స్పందించాడు. కెప్టెన్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా నిర్ణ‌యంచ‌లేద‌ని జై షా తెలిపాడు.

"భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ ఎవ‌ర‌న్న‌ది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. సెలక్టర్లతో చ‌ర్చించిన త‌ర్వాత‌ అధికారికంగా మేము ప్ర‌కటిస్తాము. హార్దిక్ పాండ్యా గురించి చాలా మంది తమను అడిగారని, వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ముందు అత‌డి ఫామ్‌పై చాలా ప్ర‌శ్న‌లు వినిపించాయి. 

కానీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు. అత‌డిని తనను తాను నిరూపించుకున్నాడు. ఏదేమైనప్పటికి కెప్టెన్సీ విష‌యంలో సెల‌క్ట‌ర్ల‌దే తుది నిర్ణ‌య‌మ‌ని" జై షా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ నెల‌లో భార‌త్ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త జ‌ట్టు 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి.

శ్రీలంక ప‌ర్య‌ట‌న స‌మ‌యానికి భార‌త జ‌ట్టుకు కొత్త టీ20 కెప్టెన్ వ‌చ్చే అవ‌కాశముంది. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2024లో హార్దిక్‌ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.
చదవండి: రో.. నీలాంటి వ్య‌క్తి నా సొంత‌మైనంద‌కు చాలా గ‌ర్విస్తున్నా: రితికా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement