కెప్టెన్సీ కొత్త క‌దా బ్రో.. కొంచెం క‌న్ఫ్యూజ్ ఉంటుందిలే! వీడియో వైర‌ల్‌ | Gujarat Titans Captain Shubman Gill Gets Confused During Toss | Sakshi
Sakshi News home page

#Shubman Gill: కెప్టెన్సీ కొత్త క‌దా బ్రో.. కొంచెం క‌న్ఫ్యూజ్ ఉంటుందిలే! వీడియో వైర‌ల్‌

Mar 26 2024 8:18 PM | Updated on Mar 26 2024 9:54 PM

Gujarat Titans Captain Shubman Gill Gets Confused During Toss - Sakshi

ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టీమిండియా యువ ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌-2024 సీజ‌న్‌తో గుజ‌రాత్ సార‌ధిగా గైక్వాడ్ త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే  విజ‌యాన్ని అందుకున్నాడు ఇండియ‌న్ క్రికెట్ ప్రిన్స్‌.

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ విజ‌యం సాధించింది. ఇప్పుడు గుజ‌రాత్ త‌మ రెండో మ్యాచ్‌లో చెపాక్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్ టాస్ సంద‌ర్భంగా ఓ ఫ‌న్నీ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన‌ గుజ‌రాత్ కెప్టెన్ గిల్ త నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌డంలో కాస్త క‌న్ఫ్యూజ్ అయ్యాడు.

అతడు పొరపాటున 'ఫస్ట్ బ్యాటింగ్' చేస్తానని చెప్పాడు. వెంట‌నే త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటూ  'సారీ సారీ, బౌల్ ఫస్ట్' అంటూ మ్యాచ్ రిఫరీకి గిల్ తెలియ‌జేశాడు. దీంతో ఒక్క‌సారిగా అందరూ న‌వ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement