చరిత్ర సృష్టించిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా!

Goswami becomes leading wicket tacker Against England Team In England - Sakshi

ఇంగ్లండ్‌ మహిళలలతో వన్డే సిరీస్‌ను భారత్‌ విజయంతో ఆరంభించింది. హోవ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా తన కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న భారత భారత వెటరన్‌ పేసర్‌ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో గోస్వామి తన 10 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టింది.

తద్వారా ఇంగ్లండ్‌ గడ్డపై ఇంగ్లీస్‌ జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. అంతుకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ కేథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్(23 వికెట్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఝులన్(24 వికెట్లు) కేథరిన్ రికార్డురు బ్రేక్‌ చేసింది. అదే విధంగా భారత్‌ తరపున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయష్కరాలుగా కూడా గోస్వామి నిలిచింది.

39 ఏళ్ల 297 రోజుల వయస్సులో ఆమె ఈ మ్యాచ్‌ ఆడింది. అంతకుముందు భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 39 ఏళ్ల 114 రోజుల వయసులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక ఈ సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గోస్వామి గుడ్‌బై చెప్పనుంది. లార్డ్స్‌ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది.
చదవండిIND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top