PELE: ఐసీయూలో ఫుట్‌బాల్ దిగ్గజం..

Football Legend Pele Remains In Intensive Care After Surgery - Sakshi

న్యూఢిల్లీ: అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం, బ్రెజిల్‌ మాజీ ఆటగాడు పీలేకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పెద్దప్రేగుకు సర్జరీ అనంతరం పర్యవేక్షణ నిమిత్తం అతన్ని ఐసీయూలో ఉంచారు. అయితే, ప్రస్తుతం పీలే ఆరోగ్యం నిలకడగా ఉందని, కీలక అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని, ఆయన ఉత్సాహంగా మాట్లాడగలుతున్నారుని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. తన ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందంటూ పీలే తన ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా గత నెలలో  ఆసుపత్రికి వెళ్లగా.. పెద్దపేగులో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని వెంటనే సర్జరీ ద్వారా తొలగించాలని తెలిపారు. రొటీన్ కార్డియోవాస్కులర్, లాబోరేటరీ పరీక్షల్లో భాగంగా ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్‌ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. ఇక క్లబ్ ఫుట్‌బాల్‌ విషయానికొస్తే.. ఈ పోటీల్లో సైతం అత్యధిక గోల్స్ రికార్డు పీలే పేరిటే ఉండేది. ఈ రికార్డును అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్‌ లియోనల్ మెస్సీ గతేడాదే బ్రేక్ చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్‌ క్లబ్‌కు 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్‌ చేయగా, 2004 నుంచి 2020 వరకు బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 17 సీజన్ల పాటు ఆడి 749 మ్యాచ్‌ల్లో 644 గోల్స్ చేసి పీలే రికార్డును అధిగమించాడు.
చదవండి: టెన్నిస్‌ చరిత్రలో పెనుసంచలనం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top