ఫ్యాన్స్‌కు షాక్‌.. ఒక్కో టిక్కెట్‌ ధర రూ. 10 లక్షలు! | FIFA Raises Top Price For World Cup 2026 Final | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: ఒక్కో టిక్కెట్‌ ధర రూ. 10 లక్షలు!

Apr 2 2026 11:28 AM | Updated on Apr 2 2026 1:13 PM

FIFA Raises Top Price For World Cup 2026 Final

అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్‌-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మొత్తం 48 జ‌ట్లు పాల్గొనున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ ధరలు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

లాస్ట్-మినిట్ సేల్స్ ఫేజ్ పేరిట టికెట్ల విక్రయాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లకు (సుమారురూ.9.16 లక్షలు) పెంచింది. గత డిసెంబర్‌లో టోర్నమెంట్ డ్రా సమయంలో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లుగా ఉండేది. 

మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధర 2,355 డాలర్ల నుండి 2,985 డాలర్లకు పెరిగింది. కాగా ఫిఫా ఈసారి 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేస్తోంది. అంటే డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇదే విధానం విమానం టికెట్ల బుకింగ్‌లో కూడా ఉంటుంది. అయితే ఫిఫా  అనుసరిస్తున్న ఈ ధరల విధానంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

"ఫిఫా ప్రపంచకప్‌-2026 కోసం 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయడం సరికాదు. ఇది సామాన్య సాకర్‌ అభిమానులను క్రీడకు దూరం చేస్తుంది" అని 69 మంది డెమొక్రాటిక్ సభ్యులు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు లేఖ రాశారు. 

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే?
గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియా
గ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్
గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్
గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీ
గ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్
గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియా

గ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్
గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వే
గ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియా
గ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్
గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా
గ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామా
చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్క‌ర్‌.. జ‌ట్టు మారినా?
 

Advertisement
 
Advertisement
Advertisement