మ్యాచ్‌ జరుగుతుండగా విరాట్‌ కోహ్లి ఫోటో ప్రత్యక్షం

ENG vs IND: Fan Spotted With Virat Kohli Sketch Became Viral - Sakshi

లీడ్స్‌: సాధారణంగానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అభిమానులు ఎక్కువగానే ఉంటారు. కోహ్లి తన అగ్రెసివ్‌ ప్రవర్తనతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో ఉన్నాడంటే కోహ్లి చేసే హంగామా మాములుగా ఉండదు. తన హావభావాలతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మూడోటెస్టులో మ్యాచ్‌ జరుగుతుండగా ఒక అభిమాని తన చేతిలో విరాట్‌ కోహ్లి పోస్టర్‌ను పట్టుకొని ప్రదర్శించాడు. ఇది చూసిన మిగతా అభిమానులు కూడా ''కోహ్లి.. కోహ్లి'' అని అరుస్తూ అతనికి మద్దతిచ్చారు.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి:  ఇంగ్లండ్‌ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు

ఇక టీమిండియా మూడోటెస్టులో దారుణమైన ఆటతీరు కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 78 పరుగులకే ఆలౌట్‌ అయిన టీమిండియా ఇంగ్లండ్‌ను ఏ మాత్రం నిలువరించలేకపోయింది. భారత బౌలర్లను ఉతికారేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. జో రూట్‌ అద్భుత సెంచరీతో మెరవగా.. డేవిడ్‌ మలాన్‌ అర్థ సెంచరీతో రాణించాడు. ఇప్పటికే 345 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. 

చదవండి: Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top