దివ్యాంశి ధమాకా | Divyanshi Bhowmik Wins World Table Tennis Pristina Feeder Level Tournament | Sakshi
Sakshi News home page

దివ్యాంశి ధమాకా

Jun 2 2026 9:52 AM | Updated on Jun 2 2026 12:30 PM

Divyanshi Bhowmik Wins World Table Tennis Pristina Feeder Level Tournament

వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్రిస్టినా ఫీడర్‌ లెవెల్‌ టోర్నమెంట్‌

భారత టీనేజర్‌ దివ్యాంశి భౌమిక్‌

ప్రిస్టినా (కొసోవో): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ప్రిస్టినా ఫీడర్‌ లెవెల్‌ టోర్నమెంట్‌లో భారత టీనేజర్‌ దివ్యాంశి భౌమిక్‌ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌ విభాగంలో టైటిల్స్‌ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో డబ్ల్యూటీటీ ఫీడర్‌ లెవెల్‌ టోరీ్నలో భారత్‌ తరఫున మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన అతిపిన్న వయసు్కరాలిగా 15 ఏళ్ల దివ్యాంశి రికార్డు నెలకొలి్పంది. ఓవరాల్‌గా మివా హరిమోటో (జపాన్‌) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 211వ ర్యాంకర్‌ దివ్యాంశి 8–11, 11–8, 11–5, 7–11, 11–7తో ప్రపంచ 38వ ర్యాంకర్‌ యె యి టియాన్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించింది.

డబుల్స్‌ ఫైనల్లో దివ్యాంశి–సిండ్రెల్లా దాస్‌ (భారత్‌) ద్వయం 7–11, 14–12, 12–14, 11–8, 11–7తో సాచి అవోకి–కొకోనా మురమత్సు (జపాన్‌) జోడీపై గెలుపొందింది. సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గినందుకు దివ్యాంశి ఖాతాలో 1,450 డాలర్ల (రూ. 1 లక్ష 37 వేలు) ప్రైజ్‌మనీ, 125 ర్యాంకింగ్‌ పాయింట్లు చేరాయి. డబుల్స్‌ టైటిల్‌ సాధించినందుకు దివ్యాంశి–సిండ్రెల్లాలకు 500 డాలర్లు (రూ. 47 వేలు), 125 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement